Begin typing your search above and press return to search.
అయ్యన్నకు ప్రభుత్వానికి సరిపోయిందా ?
By: Tupaki Desk | 25 Feb 2022 5:08 AM GMTతెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకి ప్రభుత్వానికి సరిగ్గా సరిపోయింది. పార్టీ ఓటమి తో పాటు వ్యక్తిగతంగా చింతకాయల కూడా నర్సీపట్నంలో ఓడిపోయారు. అప్పటి నుండి జగన్మోహన్ రెడ్డిపైన వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టుకున్నారు. విధానపరంగా ప్రభుత్వాన్ని ఎన్నైనా విమర్శించవచ్చు తప్పులేదు. ప్రభుత్వంలో జరిగే తప్పులను ఎత్తిచూపాల్సిందే.
అయితే అయ్యన్న ఆ పని చేయకుండా జగన్ను వ్యక్తిగతంగా తిడుతున్నారు. సీఎంను పట్టుకుని మాజీ మంత్రి బూతులు కూడా యధేచ్చగా తిట్టేస్తున్నారు. గతంలోనే మంత్రులు, వైసీపీ ఎంఎల్ఏలు కొందరు అయ్యన్నకు ఈ విషయంలో వార్నింగిచ్చారు. అయినా చింతకాయలు పట్టించుకోలేదు. పోలీసులు కూడా హెచ్చరించినా పట్టించుకోలేదు. దాంతో ఒక కేసు నమోదయ్యింది. నర్సీపట్నం కమీషనర్ ను పట్టుకుని పదిమందిలో బట్టలూడదీసి కొడతానన్నారు.
అయ్యన్నపై అదొక కేసైంది. తర్వాత కూడా మరో రెండు కేసులు నమోదయ్యాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలోని నల్లజర్ల సమావేశంలో మళ్ళీ జగన్ను పట్టుకుని బూతులు తిట్టడంతో కేసైంది. ఆ కేసులో నోటీసులివ్వటానికి పోలీసులు వస్తే అయ్యన్న కలవటం లేదు. పోలీసులు తనను ఎక్కడ అరెస్టు చేస్తారనో అనే భయంతోనే ఇంటిచుట్టూతా టీడీపీ కార్యకర్తలను పెట్టుకుని కూర్చున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. అసలు అయ్యన్న నోటి దురుసే పరిస్దితిని ఇంతదాకా తెచ్చింది.
జగన్ ను తాను ఇలాగే బూతులు తిడతాను, ఇలాగే మాట్లాడుతాను ఏం పీక్కుంటారో పీక్కోండని చాలెంజ్ కూడా చేశారు గతంలో. నిజానికి ప్రభుత్వాన్ని విమర్శించటం మానేసి జగన్ను డైరెక్టుగా ఎటాక్ చేయాల్సిన అవసరమే లేదు. అయినా పదే పదే చేస్తున్నారు, తాను ఇలాగే అంటాను ఏం పీక్కుంటావో పీక్కో అని అన్నారంటేనే అయ్యన్న కావాలనే ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నట్లు అర్ధమైపోతోంది. పోనీ మాటమీద నిలబడతారా అంటే అదీలేదు. పోలీసులు ఇంటికి వస్తే కనబడకుండా మాయమైపోతున్నారు.
తన మీద కేసులు పెట్టుకోండి అరెస్టులు చేయండి అని చాలెంజ్ చేసిన అయ్యన్న తీరా నోటీసులు ఇవ్వటానికి వస్తే తీసుకోవటానికి ఎందుకు నిరాకరిస్తున్నట్లు ? పదే పదే జగన్ను టార్గెట్ చేసుకుంటున్నట్లు అర్ధమైపోతోంది. అయ్యన్న మాటలకు ప్రభుత్వం చేష్టలకు సరిపోయింది. ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీకి లాభం లేకపోగా నష్టం మాత్రం ఖాయంగా జరుగుతుంది.
వైసీపీ మంత్రులు, వైసీపీ నేతల బూతు భాషను వివాద శైలిని మెల్లగా టీడీపీ ఓన్ చేసుకుని అదే కోణంలో రిటార్ట్ ఇస్తున్నట్లు అర్థమవుతోంది. కాబట్టి మొదలుపెట్టిన వారు బూతులు తగ్గిస్తే ఆటోమేటిగ్గా ప్రతిపక్షం సైలెంట్ అవ్వక మానదు. ఈ లాజిక్ ను వైసీపీ నేతలు అర్థం చేసుకుంటారా?