Begin typing your search above and press return to search.
కోవిడ్ సమయంలో భారత్ స్పందన పై బిల్ గేట్స్ ప్రశంసలు.!
By: Tupaki Desk | 25 Feb 2022 6:27 AM GMTకరోనా సమయంలో టీకాలు ప్రధాన పాత్ర పోషించాయి. అయితే వ్యాక్సిన్ లను తయారు చేయడంలో భారత్ కీలక పాత్ర పోషించింది. ప్రపంచ దేశాలకు టీకాలను అందించడంలో మనం దేశం చేసిన కృషిని అపార కుబేరుడు, ప్రపంచ బిలీనియర్ లో ఒకరైన బిల్ గేట్స్ ప్రశంసించారు. అంతేగాకుండా భారత్ చేసిన కృషి కారణంగా టీకాలు ప్రపంచ స్థాయిలో అందుబాటు ధరల్లో ఉన్నాయని గుర్తు చేశారు.
భారత్ లో ఉండే ఫార్మా కంపెనీల కారణంగా భారీ స్థాయిలో టీకాలను ఉత్పత్తి చేయగలిగినట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్ తయారీలో భారత్ సామర్థ్యం అనిర్వచనీయమైని అన్నారు. ఈ మేరకు అమెరికాలోని ఇండియన్ ఎంబసీ ఏర్పాటు చేసిన ఇండియా-యూఎస్ హెల్త్ పార్ట్‌నర్‌షిప్ అనే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇదే సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏడాది కాలంలో ఇండియా నుంచి సుమారు 150 మిలియన్ల కరోనా టీకాలు ఇతర దేశాలకు తరలించినట్లు పేర్కొన్నారు. భారత్ టీకా ఉత్పత్తి కారణంగా సుమారు 100 కు పైగా దేశాలు లబ్ధి పొందినట్లు చెప్పుకొచ్చారు. భారత్ లో టీకాల ఉత్పత్తికి పెద్ద పీట వేసినట్లు చెప్పిన బిల్ గేట్స్.. దాని ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం చూస్తున్నామని అన్నారు.
భారత్ లో వ్యాక్సిన్ ల ఉత్పత్తి కారణంగా చాలా దేశాల లోని పిల్లలకు వివిధ రకాల టీకాలను ఇవ్వగలుగుతున్నట్లు తెలిపారు. ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్న పిల్లలను రక్షించగలుతున్న ఘనత కేవలం భారత్ కు మాత్రమే దక్కుతుందని అన్నారు. నిమోనియా, రోటో వైరల్ లాంటి ప్రాణాంతక జబ్బుల నుంచి చిన్న పిల్లలను భారత్ ఉత్పత్తి చేసిన టీకాలే రక్షిస్తున్నాయని కొనియాడారు.
కరోనా వైరస్ వ్యాప్తి మరి కొద్ది రోజులు ఉంటుందని బిల్ గేట్స్ అన్నారు. మహమ్మారని అదుపు చేయడంతో పాటు భవిష్యత్తులో వచ్చే మరిన్ని వైరస్ లను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. భారతీయులు వైద్య శాస్త్రంలో మెళకువలు ప్రపంచ వ్యాప్తం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కారణంగా వివిధ దేశాలలోని చాలా మంది ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారని అన్నారు. టీకాలను సంబంధించిన ఇప్పటికే భారత్ చాలా కీలక ఒప్పందాలను వివిధ దేశాలతో చేసుకున్నట్లు గుర్తు చేశారు. ఇందుకు నిదర్శనంగా క్వాడ్ సభ్య దేశాలతో జరిగిన ఒప్పందం గురించి ప్రస్తావించారు.