Begin typing your search above and press return to search.
సీనియర్ మంత్రి రాజకీయ వైరాగ్యం....?
By: Tupaki Desk | 23 Feb 2022 11:30 AM GMTరాజకీయాలు అంటేనే అదొక ఉత్సాహం. ఒకసారి ఆ రంగంలో ప్రవేశించిన వారు చివరి శ్వాస వరకూ కొనసాగాలనే అనుకుంటారు. నో రిటైర్మెంట్ అన్నది వారి ఆలోచనగా ఉంటుంది. ఇక్కడ వయసులో సంబంధం లేదు, అవకాశాలు అలా అందిపుచ్చుకుంటూ రాజకీయాల్లో సదా వెలిగిపోవాలనుకుంటారు. అయితే కొందరు మాత్రం పరుగును మధ్యలో ఆపేయాలనుకుంటారు. ఎపుడూ ఈ రాజకీయమేనా, సొంత జీవితం కూడా ఉంటుంది కదా అని ఆలోచనలు చేసేవారూ ఉన్నారు.
వైఎస్సార్ అయితే అరవై ఏళ్ళు వచ్చాక తాను రాజకీయాల నుంచి స్వచ్చందంగానే రిటైర్ అవుతాను అని అనేవారు. అయితే ఆయన ఆ వయసులో ఉండగానే అనుకోని దుర్ఘటనలో ఏకంగా ఈ లోకాన్నీ వీడాల్సి వచ్చింది. అలా వైఎస్సార్ లా బోల్డ్ గా చెప్పే రాజకీయ నేత అయితే ఇప్పటిదాకా రాజకీయాల్లో ఎక్కడా కనిపించడంలేదు అన్నది వాస్తవం.
ఇదిలా ఉండగా వైసీపీ మంత్రివర్గంలో సీనియర్ మంత్రులు కొందరు ఉన్నారు. వారిది సుదీర్ఘమైన రాజకీయ అనుభవం. అలాంటి వారిలో ఒకరైన బొత్స సత్యనారాయణ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. బొత్స సీనియారిటీకి ముఖ్యమంత్రి కావాల్సింది. ఆయన ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్ గా పనిచేశారు. ఒక దశలో కిరణ్ కుమార్ రెడ్డిని తప్పిస్తే బొత్సకే సీఎం అవకాశం ఇస్తారని కూడా ప్రచారం జరిగింది.
అలాంటిది ఆయన రాజకీయ జాతకం కలసిరాక అలాగే ఉండిపోయారు. విభజన ఏపీలో కాంగ్రెస్ పని అయిపోవడంతో ఆయన వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో తాను గెలవడమే కాదు, పార్టీని కూడా విజయనగరం జిల్లాలో గెలిపించగలిగారు. మొత్తానికి మొత్తం సీట్లు వైసీపీ గెలుచుకుని స్వీప్ చేసి పారేసింది. ఇక జగన్ మంత్రివర్గంలో కీలకమైన మునిసిపల్ శాఖ మంత్రిగా బొత్సకు అవకాశం వచ్చింది.
ఆయనను జగన్ బాగానే గౌరవిస్తున్నా బొత్స మాత్రం ఏదో తెలియని వెలితి ఫీల్ అవుతున్నారు అని అంటున్నారు. ఆయన చాలా సందర్భాల్లో చానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా ఒక మాట అంటూ ఉంటారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అక్కడ ఉన్న స్వేచ్చ ప్రాంతీయ పార్టీలలో రాదు కదా అని. అందుకే ఆయన కొంతకాలంగా సైలెంట్ గానే ఉంటున్నారు. వీలు అయినపుడు అవసరం అయినపుడు మాత్రమే గొంతు విప్పుతున్నారు.
మరో వైపు చూస్తే జగన్ సీనియర్ మంత్రులతో కంటే జూనియర్లతోనే ఎక్కువ చనువుగా ఉంటున్నారని ప్రచారంలో ఉంది. అదే టైమ్ లో ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా కొత్త వారికే ప్రాధాన్యత ఇవ్వాలని, యంగ్ స్టర్స్ ని మంత్రులుగా చేసుకోవాలని అనుకుంటున్నారు. దాంతో అధినేత ఆలోచనలను పసిగట్టిన సీనియర్లు మెల్లగా సైడ్ అవుతున్నారు.
బొత్స కూడా ఇపుడు అదే రూట్ పట్టారు అంటున్నారు. జగన్ సీనియర్ల సేవలను పార్టీకి వాడుకోవాలని చూస్తున్నారు. ఇక బొత్స వంటి వారు అయితే ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పేయాలని ఆలోచిస్తున్నారుట. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని ఈసరికే బొత్స నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. తన బదులుగా కుమారుడు బొత్స సందీప్ ని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేయించడం ద్వారా తనదైన మార్క్ ఇండైరెక్ట్ గా చూపించాలనుకుంటున్నారుట.
జగన్ సైతం ఇలాంటి ప్రతిపాదనకు సరే అంటారు కాబట్టి హుందాగా రాజకీయాల నుంచి ఈ సమయంలో తప్పుకుంటేనే బెటర్ అని బొత్స ఆలోచనగా ఉందని చెబుతున్నారు. ఇక కుమారుడిని రాజకీయంగా తీర్చిదిద్దే పనిలోనే బొత్స ఫుల్ టైమ్ స్పెండ్ చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి విజయనగరం జిల్లా అంటే బొత్సగానే అంతా గుర్తిస్తారు. అలాంటి బొత్స రాజకీయాల నుంచి తప్పుకుంటే అభిమానులకు ఇబ్బందే. అయితే ఇప్పటి రాజకీయాలకు వైసీపీలో ఉన్న పరిస్థితులకు తాను ఫిట్ కానను బొత్స భావిస్తున్నారుట. అందుకే ఆయన రాజకీయాల పట్ల వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు అని అంటున్నారు.