Begin typing your search above and press return to search.

చిన్నజీయర్ స్వామిపై అట్రాసిటీ కేసు పెట్టాలంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

By:  Tupaki Desk   |   17 March 2022 6:28 AM GMT
చిన్నజీయర్ స్వామిపై అట్రాసిటీ కేసు పెట్టాలంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
X
గిరిజన ఆరాధ్య దైవాలైన సమ్మక్క-సారలమ్మలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చినజీయర్ స్వామిపై తెలంగాణ ఆదివాసీ గిరిజన సంక్షేమ సంఘాలు మండిపడ్డాయి. చినజీయర్ స్వామి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. ఆదివాసీ గిరిజనులకు క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దిష్టిబొమ్మల దహనాలు, చినజీయర్ ఫొటోకు చెప్పుల దండలు వేసి తమ నిరసన తెలుపుతున్నారు.

తాజాగా మేడారం సమ్మక్క సారలమ్మలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చినజీయర్ స్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ లో ఆదివాసీల ఆరాధ్య దైవం అయిన.. సమ్మక్క-సారలమ్మలను అవమానించేలా చిన్నజీయర్ స్వామి మాట్లాడారని.. ఆయన మాట్లాడిన వీడియోతో సహా పోలీసులకు ఇచ్చి కేసునమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.

ఇక చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ నిర్మాత అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చినజీయర్ వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘చినజీయర్ ఒక వెధవ.. బ్లాక్ టికెట్లు అమ్ముకునే సన్నాసి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సమాజానికి చినజీయర్ క్షమాపణలు చెప్పాలని అశ్వినీదత్ డిమాండ్ చేశారు.

ఇక చినజీయర్ వ్యాఖ్యలను సీపీఐ నారాయణ ఖండించారు. స్వామి సమ్మక్క-సారక్కలపై చేసిన వ్యాఖ్యలను నారాయణ తప్పుపట్టారు. తక్షణమే ఈ చినజీయర్ స్వామి తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను ఖండించాలన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చిన్న జీయర్ స్వామి వెంట ఉన్నారని ఆరోపించారు. ఆధ్యాత్మికత పేరుతో వ్యాపారం చేస్తున్న వ్యక్తి చినజీయర్ అంటూ నారాయణ విమర్శించారు. తక్షణం సమ్మక్క సారలమ్మలపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ గిరిజన ఆరాధ్య దైవాలైన సమ్మక్క-సారలమ్మలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చినజీయర్ స్వామిపై తెలంగాణ ఆదివాసీ గిరిజన సంక్షేమ సంఘాలు మండిపడ్డాయి. చినజీయర్ స్వామి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. ఆదివాసీ గిరిజనులకు క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దిష్టిబొమ్మల దహనాలు, చినజీయర్ ఫొటోకు చెప్పుల దండలు వేసి తమ నిరసన తెలుపుతున్నారు.

తాజాగా మేడారం సమ్మక్క సారలమ్మలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చినజీయర్ స్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ లో ఆదివాసీల ఆరాధ్య దైవం అయిన.. సమ్మక్క-సారలమ్మలను అవమానించేలా చిన్నజీయర్ స్వామి మాట్లాడారని.. ఆయన మాట్లాడిన వీడియోతో సహా పోలీసులకు ఇచ్చి కేసునమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.

ఇక చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ నిర్మాత అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చినజీయర్ వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘చినజీయర్ ఒక వెధవ.. బ్లాక్ టికెట్లు అమ్ముకునే సన్నాసి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సమాజానికి చినజీయర్ క్షమాపణలు చెప్పాలని అశ్వినీదత్ డిమాండ్ చేశారు.

ఇక చినజీయర్ వ్యాఖ్యలను సీపీఐ నారాయణ ఖండించారు. స్వామి సమ్మక్క-సారక్కలపై చేసిన వ్యాఖ్యలను నారాయణ తప్పుపట్టారు. తక్షణమే ఈ చినజీయర్ స్వామి తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను ఖండించాలన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చిన్న జీయర్ స్వామి వెంట ఉన్నారని ఆరోపించారు. ఆధ్యాత్మికత పేరుతో వ్యాపారం చేస్తున్న వ్యక్తి చినజీయర్ అంటూ నారాయణ విమర్శించారు. తక్షణం సమ్మక్క సారలమ్మలపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.