Begin typing your search above and press return to search.
10 నిముషాల్లో నేరాలను అరికడతాం.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 23 March 2022 8:31 AM GMTఏపీలో మహిళల రక్షణే ధ్యేయంగా తీసుకొచ్చిన దిశ చట్టంలో భాగంగా... దిశ పెట్రోలింగ్ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. సచివాలయం మొదటి బ్లాక్ నుంచి సీఎం ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో భాగంగా 163 వాహనాలను కొనుగోలు చేశారు. గతంలోనూ అన్ని పోలీస్ స్టేషన్లకు 900 ద్విచక్ర వాహనాలు అందించారు.
అత్యవసర పరిస్థితుల్లో మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ దిశ పెట్రోలింగ్ను మొదలుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లకు 900 ద్విచక్ర వాహనాలు మహిళల రక్షణ కోసం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కేవలం 10 నిముషాల్లోనే మహిళలపై నేరాలను కట్టడి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కోటి 16 లక్షల మంది మహిళలు దిశా యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారని సీఎం జగన్ తెలిపారు.
దిశా యాప్ ద్వారా.. మహిళలకు వేగంగా రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 163 దిశా పోలీస్ వాహనాలతో పాటు.. బందోబస్తు సమయాల్లో మహిళా పోలీసులకు సౌకర్యవంతంగా ఉండేలా 18 కారా వ్యాన్‌లను విజయవాడలో సీఎం జగన్ ప్రారంభించారు. దిశా యాప్ ద్వారా ఫిర్యాదు అందిన 10 నిమిషాల్లోపే సహాయం అందేలా ప్రయత్నం చేస్తున్నామనని సీఎం వెల్లడించారు. మహిళలకు ఒక అన్నగా, తమ్ముడిగా తాను.. ఈ రక్షణ చర్యలు చేపట్టినట్టు జగన్ చెప్పారు. అంతేకాదు.. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండేలా.. ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు.
జరిగిన నేరానికి సంబందించిన వివరాలు, సమయం, ప్రాంతం వంటి వాటిని గుర్తించి మ్యాపింగ్ చేస్తూ, ఆ సమాచారాన్ని దిశ పెట్రోలింగ్ వాహనాలను పోలీస్ విభాగం అనుసంధానించింది. ఇందులో భాగంగా 163 వాహనాలను కొనుగోలు చేశారు. జిల్లా యూనిట్ కంట్రోల్ రూం నుంచి నేరుగా ప్రత్యక్ష పర్యవేక్షణకు అనుగుణంగా ప్రత్యేక జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దిశ పెట్రోలింగ్ వాహనాలు కొనుగోలు కు రూ.13.85 కోట్లను వెచ్చించారు. ప్రస్తుతం ఈ వ్యవస్థ మరింత వేగంగా మహిళలకు, బాధితులకు సేవ లు అందిస్తుందని.. సీఎం చెప్పారు.