Begin typing your search above and press return to search.
కాంగ్రెస్-23 నేతలను వదిలించుకుంటేనే మంచిది.. వాళ్లు కోవర్టులేనా?
By: Tupaki Desk | 21 March 2022 3:31 PM GMTజాతీయ పార్టీ కాంగ్రెస్ కు నమ్మకస్తులుగా ఉంటూనే.. ఆ పార్టీ గొంతునులుముతున్న నాయకులు రెచ్చిపో తు న్నారు. జాతీయ స్థాయిలో పేరున్న పార్టీకి.. అసమ్మతి స్వరం వినిపించడంలో గ్రూప్(జీ)-23 అనేలా.. 23 మంది కీలకనాయకులు జట్టు కట్టి మరీ.. పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. పార్టీ ఓటమికి లేదా.. పార్టీ పుంజు కు నేందుకు సలహాలు ఇవ్వాల్సిన నాయకులు.. అది వదిలేసి.. పార్టీని బజారున పడేసేలా వ్యవహరి స్తున్నార నే వాదనబలంగా వినిపిస్తోంది. వీరిలో ఆది నుంచి కూడా .. శశిథరూర్, ఆజాద్, కపిల్ సిబల్, ముకుల్ వాస్నిక్‌ల పేర్లు తరచుగా బయటకు వస్తుంటాయి.
మరో 19 మంది నాయకులు కూడా ఇదే తరహాలో కాంగ్రెస్ తెప్పలో కూర్చునే.. దానికి రంధ్రాలు చేస్తుంటా రు. ఇటీవల పార్టీ ఐదు రాష్ట్రాల్లోఘోర పరాజయం మూటగట్టుకుంది. దీనికి కారణం ఎవరు అనేది పక్కన పెడితే.. ఈ సమస్య నుంచి పార్టీని బయటకు తీసుకువచ్చి.. పార్టీని మరోసారి పరుగులు పెట్టించే వ్యూహాల కు పదును పెట్టాల్సిన ఈ జీ-23 నేతలు.. మాత్రం.. తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నారు. గాంధీల కుటుంబం పైనే ప్రతిపక్షాలకన్నా ఘోరంగా.. విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆజాద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ కూడా కులాలు.. మతాల రాజకీయాలను ప్రోత్సహించిందంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి ఈ పరిణామం.. మూలిగే నక్కపై తాడిపండు పడిన చందంగానే ఉంది. ఇక, కపిల్ సిబల్ మా త్రం తక్కువ తినలేదు. గాంధీలతోనేపార్టీ అంటకాగాలా.. వారిని పార్టీ నుంచి బయటకు తరిమేయాలని కొంత పరుషంగానే ట్వీట్ చేశారు. ఇలా.. అంతర్గత ప్రజాస్వామ్యం ముసుగులో విజృంభించి.. ప్రతిపక్షాల కంటే కూడా దారుణంగా.. వ్యవహరిస్తున్న ఇలాంటి నాయకులను పార్టీలో ఎంత వరకు కొనసాగించాలనే ది కీలక ప్రశ్న. నిజానికి బీజేపీ ఎప్పుడు దేశంలో వీక్ అవుతుందో.. అప్పుడు వీరంతా.. పుంజుకుని.. పార్టీని బయట పడేస్తున్నారు.
బీజేపీ ఎప్పుడు దేశవ్యాప్తంగా ఆత్మరక్షణలో పడుతోందో.. అప్పుడు కాంగ్రెస్ లో అసమ్మతి మొదలు అవు ది. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. ఇదేసమయంలో పార్టీని ఎలా గాడిన పెట్టాలనే అంశంపై పార్టీలో చర్చ సాగాల్సిన అవసరం ఉంది. అయితే... దీనికి భిన్నంగా.. జీ-23 నాయకులు.. గాంధీ కుటుంబం పార్టీ నుంచి తప్పుకోవాలంటూ.. రగడ చేశారు. ఈ క్రమంలోనే వారు ఒక లేఖ కూడా సందించారు.. ఇక, మీటింగులు పెట్టారు. వాస్తవానికి ఇప్పుడు ఇలాంటి రగడ అవసరమా? అంటే... అందరూ మౌనంగానేఉన్నారు.
నిజానికి ఈ 23 మంది తోపులు అయితే.. వాళ్లు పోయి.. పార్టీని గెలిపించుకుని.. రావొచ్చుకదా? అనే ప్రశ్న వస్తోంది. అంతేకాదు... గాంధీల కుటుంబమే.. కదా.. ఇప్పటి వరకు.. పార్టీని నడిపించిన విషయం తెలిసిందే. అదే గాంధీల కుటుంబం లేకపోతే.. పార్టీ మనుగడ సాధిస్తుందా? అనేది ప్రశ్న. కర్ణాటక కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ డీకే శివకుమార్ కూడా ఇదే మాట చెప్పారు. నిజానికి గాంధీల పేరు లేకపోతే..ఈ 23 మంది ఎక్కడ ఉన్నారు. కనీసం.. ఒంటరిగా వెళ్లి..వార్డు మెంబర్లు అయినా.. గెలుచుకురాగలరా? అనేది సూటి ప్రశ్న.
ఎందుకంటే.. ఈ 23 మంది ఎప్పుడూ.. ప్రజల్లోకి వెళ్లింది లేదు. ప్రజల్లో ఉన్నది లేదు. ఎప్పుడు చూసినా.. 10 జన్‌పథ్ చుట్టూ(సోనియా నివాసం) తిరుగుతూనే ఉన్నారు. జాతీయస్థాయిలో నాయకులుగా చలామణి అవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్లంతా అధికారం ఎంజాయ్ చేశారు. కాంగ్రె్స్ అనే ట్యాగ్ లేకపోతే... వాళ్లను సొంత ఊళ్లలో కూడా ఎవరు గుర్తించే... గౌరవించే అవకాశం కూడా లేదు. అలాంటి వాళ్లు ఈ రోజు దేశంలో బీజేపీ మీద కొంచెం వ్యతిరేకత స్టార్ అయిందంటే.. దానికి కనపడకుండా చేయాలే ఉద్దేశంతో కాంగ్రెస్‌లో అలజడి సృష్టిస్తున్నారనే వాదన బాహాటంగానే వినిపిస్తోంది.
ఈ జీ-23 నేతలకు ఒక బీజేపీ నాయకులు టచ్‌లో ఉండి .. వాళ్తతో నాటకం ఆడిస్తున్నాడనే వాదన కూడా జాతీయ రాజకీయాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా మాజీ సీఎం ఆజాద్‌కు రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం చూస్తే.. ఇది నిజమేననే భావన కూడా వ్యక్తమవుతుంది. అంటే.. దీనిని బట్టి..ఈ 23 మందిని కోవర్టులుగా కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో వీరిని వదిలించుకోవడమే మంచిదని అంటున్నారు. మరి ఇప్పటికైనా అధిష్టానం ఆదిశగా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.