Begin typing your search above and press return to search.
ఫీల్డ్ లోకి దిగిపోయిన పవన్...గ్రేట్ హెల్ప్
By: Tupaki Desk | 12 April 2022 9:30 AM GMTరాజకీయాల్లో ఎంతసేపూ తీసుకోవడమే కానీ ఇవ్వడం అన్నది ఉండదు. ఎంత సంపాదించామన్నదే చూసుకుంటారు. ఆ చిట్టా పద్దుల లెక్కలు ఎప్పటికీ తేలేవి కావు. ఇక ఏలికలు ప్రజలకు చేస్తున్న మేలు అంతా ప్రజలు కట్టిన పన్నుల నుంచే. కానీ ఒక రాజకీయ పార్టీ తాను సొంతంగా నిధులు వెచ్చించి చేసినది ఏదీ పెద్దగా లేదు అనే చెప్పుకోవాలి. ఇకజనాలకు చేతనైన సాయం చేయడం అయితే గతంలో జరిగిందే కానీ వర్తమానంలో చాలా తక్కువ అని చెప్పాలి. కానీ ఏపీ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించాలని చూస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఇపుడు ఫీల్డ్ లోకి దిగిపోయారు.
ఆయన కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శిస్తున్నారు. వారి ఇళ్లకు స్వయంగా తాను వెళ్ళి లక్ష రూపాయలు పార్టీ తరఫున ఇస్తున్నారు. ఇది నిజంగా గొప్ప విషయంగానే చూడాలి. పవన్ పార్టీకి ఏపీలో ఇప్పటిదాకా అధికారపు చాయ ఏదీ లేదు. ప్రధాన ప్రతిపక్షం రోల్ లో కూడా లేదు. కానీ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో సొంత నిధులను వెచ్చించి సాయం చేయడం మాత్రం అభినందించాలి.
పవన్ కొత్తగా ఏర్పాటు అయిన శ్రీ సత్యసాయి జిల్లా నుంచి ఆయన కౌలు రైతు భరోసా యాత్రను ప్రారంభించారు. సత్యసాయి జిల్లా కొత్త చెరువు విజయనగర్ కాలనీలో అప్పుల బాధతో మృతి చెందిన రైతు రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. రామకృష్ణ భార్య సుజాతకు లక్ష రూపాయల చెక్ అందజేశారు. వారి స్థితి గతుల మీద కూడా వాకబు చేశారు. తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన ధైర్యం చెప్పారు.
ఇక అక్కడ నుంచి ఆయన అనంతపురం రూరల్ మండలం పూలకుంట, మన్నీల గ్రామాలకు చేరుకుని వారికి కూడా లక్ష వంతున సహాయాన్ని అందచేస్తారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 28 కౌలు రైతులు తమ ఉసురు తీసుకున్నారు అన్నది జనసేన సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం. దాంతో ఈ మొత్తం కుటుంబాలు అందరికీ లక్ష వంతున సాయం చేయడానికి పవన్ ముందుకు రావడం మంచి పరిణానమే అంటున్నారు.
మరి ఒక విధంగా ఇది సర్కార్ పెద్దలను మేలుకొలిపే కార్యక్రమం దాంతో ప్రభుత్వం ఇంతకు నాలుగైదింతలు అంటే కనీసంగా ఏడు లక్షల రూపాయలు అయినా ఒక్కో కౌలు రైతు కుటుంబానికి అందించాలని జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి పవన్ యాత్ర స్టార్ట్ అయింది. అది కూడా రైతులను టచ్ చేస్తూ సాగుతోంది. ఈ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.