Begin typing your search above and press return to search.
కంగనా రనౌత్ కు షాకిచ్చిన కోర్టు
By: Tupaki Desk | 25 March 2022 8:28 AM GMTకంగనా రనౌత్ దేశంలో పేరొందిన సెలబ్రెటీ. కానీ ఆమె ఒక కేసులో నిందితురాలు అన్న విషయాన్ని తాజాగా గుర్తుంచుకోవాలని ముంబైలోని స్థానిక కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టులో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ ను కోర్టు తిరస్కరించింది.
కంగనా రనౌత్ సెలబ్రిటీనే కావొచ్చన్న కోర్టు ఆమె నిందితురాలు కాబట్టి న్యాయస్తానం నిబంధనలను తప్పకుండా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణకు సహకరించకపోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఈ కేసులో కంగనా రనౌత్ తనకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మెట్రో పాలిటిన్ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఓ ఇంటర్వ్యూలో భాగంగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కంగనా రనౌత్ పై బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అక్తర్ ఆరోపించారు. దీంతో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కంగనా రనౌత్ పై బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అక్తర్ ఆరోపించారు. తన పరువుకు భంగం కలిగిందంటూ 2020 నవంబర్ లో ఆయన స్థానిక న్యాయస్తానంలో పరువు నష్టం దావా వేశారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటి నుంచి కేసు విచారణకు కంగనా రనౌత్ హాజరవడం లేదు.
ఈ క్రమంలోనే తాను దేశంలో ప్రముఖ టాప్ హీరోయిన్లలో ఒకరిని అని.. వృత్తిపరంగా దేశ విదేశాల్లో ఎన్నో ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొంటూ వ్యక్తిగత హాజరు మినహాయింపును ఇవ్వాలని కంగనా కోరింది. అయితే కంగనా అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఆమె వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉండవచ్చు. కానీ ఆమె ఓ కేసులో నిందితురాలనే విషయాన్ని మరిచిపోవద్దని మెజిస్ట్రేట్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసు విచారణలో తనకు ఇష్టం వచ్చిన పద్ధతిలో నిందితురాలు వ్యవహరిస్తున్నారని కోర్టు సీరియస్ అయ్యింది. వ్యక్తిగత హాజరుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరడం హక్కు కాదనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించింది.