Begin typing your search above and press return to search.

కేసీయార్ ది డైవర్షన్ పాలిటిక్సేనా ?

By:  Tupaki Desk   |   18 July 2022 1:30 PM GMT
కేసీయార్ ది డైవర్షన్ పాలిటిక్సేనా ?
X
‘క్లౌడ్ బరస్ట్ జరిగినట్లు అనుమానంగా ఉంది’ అన్నట్లుగా కేసీయార్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా గోల మొదలైంది. గడచిన వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగింది. దీని ఫలితంగా నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో చాలావరకు జలమయమయ్యాయి. వందల సంఖ్యలో ఇళ్ళు కొట్టుకుపోగా వేలాదిమంది జనాలు నిరాశ్రయులయ్యారు. నిజానికి జూలైలో ఇంత భారీ ఎత్తున వర్షాలు, వరద రావటం అరుదనే చెప్పాలి.

భారీ వర్షాలు, వరద ముంపు కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రెండు పంపు హౌస్ లు నీళ్ళల్లో ముణిగిపోయాయి. దాంతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు కేసీయార్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు, సహాయక చర్యలపై సమీక్షించేందుకు భద్రాచలం వెళ్లిన కేసీయార్ మాట్లాడుతూ క్లౌడ్ బరస్ట్ జరిగిందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. గతంలో జమ్మూ-కాశ్మీర్, అమర్నాథ్, ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్ జరిగిందని అనుమానాలను వ్యక్తంచేశారు. దాంతో ప్రతిపక్షాలు గోల మొదలుపెట్టాయి.

నిజానికి కేసీయార్ ఆరోపణలు లేదా అనుమానాల ప్రకారమే క్లౌడ్ బరస్ట్ జరిగిందనే అనుకుంటే అవి ఎక్కడ జరగాలి ? క్లౌడ్ బరస్ట్ మహారాష్ట్రలో జరిగితే గోదావరి నదికి వరదలు వచ్చి తెలంగాణాను ముంచెత్తాలి. నిజంగా అదే జరిగితే మహారాష్ట్ర కూడా నష్టపోతుంది కదా.

క్లౌడ్ బరస్ట్ ప్రక్రియ అనేది రాష్ట్రాల చేతిలో ఉంటుందా ? లేదా కేంద్రప్రభుత్వం చేతిలో ఉంటుందా ? తెలంగాణాలో ఆకస్మిక భారీవర్షాలు, వరదలను సృష్టించి కేసీయార్ ను ఇబ్బందులకు గురిచేసే ఉద్దేశ్యమే నిజమైతే మరి మహారాష్ట్రలోని సొంత ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టుకుంటుందా ?

కేసీయార్ వ్యాఖ్యలు చూస్తుంటే కాళేశ్వరం పంప్ హౌస్ ముణగే విషయం నుండి ప్రతిపక్షాలను డైవర్ట్ చేయటానికే క్లౌడ్ బరస్ట్ అనే వ్యాఖ్యలు చేసినట్లు అర్ధమవుతోంది. కేసీయార్ వ్యాఖ్యల నేపధ్యం ప్రతిపక్షాలు తెలుసుకోలేనంత అమాయకంగా ఉన్నాయా ?