Begin typing your search above and press return to search.
ప్రజల్లో చైతన్యం ఏదీ... కోనసీమ ఘటనపై మేధావుల మాట!
By: Tupaki Desk | 29 May 2022 4:03 AM GMTతాజాగా రెండు రోజుల కిందట.. కోనసీమ జిల్లాలో తలెత్తిన ఆవేశం.. అగ్గిరాజుకుని.. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను దహించి వేసిన విషయం తెలిసిందే. ఈ మంటలు ఇంకా చల్లారలేదు. గురువారం కూడా ఓ ఎస్పీ వాహనంపై స్థానికులు కొందరు రాళ్లు రువ్వారు.
ఇదిలావుంటే.. కోనసీమ కు జిల్లాకు పేరులో అంబేడ్కర్ అనే పేరును జోడించడంపై తలెత్తి వివాదం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ అశనిపాతానికి దారితీయడం.. ప్రజలు కూడా రెండు మూడు వర్గాలు గా విడిపోయి.. దీనిపై చర్చించుకోవడం తెలిసిందే.
అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్‌ను గమనించిన మేధావి వర్గం కొన్ని విషయాలను తెరమీదికి తెచ్చింది. ఒక్క జిల్లా పేరు కోసం.. ఇంత యాగీ చేసి.. మంత్రి నివాసాన్ని తగలబెట్టిన ప్రజలు(ఉద్యమ కారులు) రాష్ట్రానికి అవసరమైన.. వాటిపై ఎందుకు ముందుకు కదలలేదు? అనే మిలియన్ డాలర్ల ప్రశ్నను సంధిస్తున్నారు. అంతేకాదు.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చడంతోపాటు.. యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే.. ప్రత్యేక హోదాపై ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటున్నారు.
ఈ క్రమంలో మేధావి వర్గం కొన్ని ప్రశ్నలు సంధించింది. తీర ప్రాంత జిల్లాలో గ్యాస్ ఉత్పత్తి సంస్థలను అంబానీ ఎత్తుకుపోతే.. ప్రజలకు ఎందుకు చలనం లేదు.? స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు ఉద్యమించలేదు. ఇది ఇస్తామని చెప్పి ఇవ్వని.. బీజేపీని ఎందుకు నిలదీయలేక పోయారు. కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలే కపోయారు. విశాఖ ఉక్కును అమ్మేస్తామని.. నిక్కచ్చిగా చెబుతున్న కేంద్రంపై ఎందుకు పోరాటం చేయలేక పోతున్నారు?
రాష్ట్రానికి జీవ నాడి వంటి పోలవరం ప్రాజెక్టును దశాబ్దాల కొద్దీ సాగదీస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకులను ఇదే ప్రజలు ఎందుకు ప్రశ్నించలేదక పోతున్నారు? విశాఖ రైల్వే జోన్ కోసం ఎందుకు మాట్లాడడం లేదు. కేంద్రం నుంచి రావాల్సిన నిదుల విషయంలో ప్రజలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం లెక్కకు మిక్కిలి అప్పులు చేస్తూ.. ఏపీని అప్పులు ప్రదేశ్‌గా మారుస్తుంటే.. ఎందుకు చలనం లేదు..? అని నిలదీస్తున్నారు. కేవలం ఒక్కక జిల్లా పేరులో చేసిన చిన్నమార్పుపై ఇంత యాగీ చేసిన.. ప్రజలకు రాష్ట్ర భవిష్యత్తు పట్టదా? అని ప్రశ్నిస్తున్నారు.