Begin typing your search above and press return to search.
లోన్ యాప్ పాడు సచ్చినోళ్ల తిక్క కుదిర్చిన హైదరాబాద్ సైబర్ పోలీసులు
By: Tupaki Desk | 30 May 2022 1:30 AM GMTయాప్ ద్వారా అప్పు ఇవ్వటం.. వసూలు చేసే క్రమంలో నోటితో చెప్పలేని పనుల్ని చేసే లోన్ యాప్ వాళ్లు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. కొంతమంది తమకు అప్పు అవసరం లేదని చెప్పినా.. వారిని ముగ్గులోకి దించి.. వేలాది రూపాయిలు వారి నుంచి వసూలు చేసే ఈ సంస్థల దారుణాలు..దుర్మార్గాలు ఆ మధ్యన బయటకు రావటం తెలిసిందే.
తాజాగా ఈ సంస్థలకు సంబంధించిన ఒక దారుణ విషయం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల ముందుకు వెళ్లింది.
ఈ లోన్ యాప్ సంస్థల ద్వారా ఒక యువతి అప్పు తీసుకుంది. అయితే.. సకాలంలో చెల్లించలేదు.
దీంతో.. ఆమె నుంచి డబ్బులు వసూలు చేసుకోవటానికి వీలుగా.. ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి.. ఆమె న్యూడ్ ఫోటోల్ని ఆమె ఫోన్ కు పంపిన వైనంతో సదరు మహిళ షాక్ తింది. అంతేకాదు.. తీసుకున్న అప్పు చెల్లించకపోతే.. మిగిలిన వారికి పంపుతామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆమె హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.
దీంతో ఈ కంప్లైంట్ ను కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. టెక్నాలజీ సాయంతో నిందితుడు బిహార్ లోని గోపాల్ పూర్ కోఠిలో ఉన్నట్లుగా తెలుసుకున్నారు. పక్కా ప్లాన్ తో పాడు వేధింపులకు గురి చేసిన మనీశ్ కుమార్ గుర్తించి అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. అతడ్ని నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించారు.
ఇక.. లోన్ యాప్ నిర్వాహకుడు వికాశ్ కుమార్ మాత్రం పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. అప్పు తీసుకొని వాయిదాలు సకాలంలో చెల్లించని వారి ఫోటోల్ని మార్పింగ్ చేసి ఈ పాడు పనికి పాల్పడుతున్నట్లు గుర్తించారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. వేరే మార్గంలో అప్పు తీసుకోవటం మంచిదేమో కానీ.. ఈ లోన్ యాప్ లకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. సో.. బీకేర్ ఫుల్!