Begin typing your search above and press return to search.
చంద్రబాబును అడ్డంగా బుక్ చేసిన మమత
By: Tupaki Desk | 18 March 2022 4:28 AM GMTఅంతర్జాతీయంగా తీవ్ర కలకలాన్ని రేపిన పెగాసన్ సాఫ్ట్ వేర్ కు సంబంధించి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో వెల్లడించిన విషయాలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. పెగాసన్ తరఫున కొందరు వ్యక్తులు తనను సంప్రదించి.. రూ.25 కోట్లు ఇస్తే.. పెగాసన్ సాఫ్ట్ వేర్ అమ్ముతామని తనకు ఆఫర్ ఇస్తే.. తాను రిజెక్టు చేసినట్లుగా చెప్పటం తెలిసిందే.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఇష్యూ మీద మాట్లాడే వేళ.. మమత నోటి నుంచి అనూహ్యంగా ఏపీ విపక్ష నేత చంద్రబాబు ప్రస్తావన వచ్చింది. తన వద్దకు వచ్చిన వేళలో.. పెగాసన్ సాఫ్ట్ వేర్ ను నాడు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కొనుగోలు చేసినట్లుగా ఆరోపించారు మమత. ఇప్పటికే అధికారం చేతిలో లేక..
కిందామీదా పడుతున్న చంద్రబాబుకు.. దీదీ నోటి వెంట వచ్చిన వ్యాఖ్యలు ఆయనకు.. ఆయన పార్టీకి శరాఘాతంగా మారనున్నాయని చెప్పాలి
ఒక పవర్ ఫుల్ ముఖ్యమంత్రిగా పేరున్న మమత నోటి నుంచి చంద్రబాబు పేరు రావటం ఒక సమస్య అయితే.. ఆయన పవర్లో ఉన్నప్పుడు కొనుగోలు చేశారని చెబుతున్న పెగాసన్ సాఫ్ట్ వేర్ ఎపిసోడ్ కు సంబంధించి తప్పనిసరిగా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎదురైందని చెప్పాలి. ఎవరో ఏదో అన్నారంటే దాని తీవ్రత ఒకలా ఉంటుంది.
కానీ.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా చంద్రబాబు పేరును ప్రస్తావించటం ద్వారా ఇప్పుడాయన ఇరుకున పడ్డారని చెప్పక తప్పదు. మరి.. దీదీ వ్యాఖ్యలకు చంద్రబాబు ఏమని బదులిస్తారన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు. ఒక విధంగా చూస్తే.. గతంలో ఎప్పుడూ లేనంతలా ఇరుక్కున్నారన్న భావన కలగటం ఖాయం.