Begin typing your search above and press return to search.
మిస్ వరల్డ్ కిరీటాన్ని చేజార్చుకున్న హైదరాబాద్ అమ్మాయి మానస
By: Tupaki Desk | 17 March 2022 8:28 AM GMTప్రపంచ సుందరి కిరీటాన్ని హైదరాబాద్ అమ్మాయి తృటి చేజార్చుకుంది. పోలాండ్ బ్యూటీకి ఈ ప్రపంచ సుందరి కిరీటం దక్కింది. గురువారం ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లోని కోకాకోలా మ్యూజిక్ హాల్‌లో జరిగిన ఈ పోటీల్లో ‘మిస్ పోలాండ్’ కరోలినా బిలావ్స్కా మిస్ వరల్డ్ 2021 కిరీటాన్ని గెలుచుకుంది.
ప్రపంచ సుందరి కరోలినా ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. ఆమె మోటివేషనల్ స్పీకర్‌గా కూడా ఎదగాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే తొలి రన్నరప్ టైటిల్ అమెరికాకు చెందిన శ్రీసైనీకి దక్కింది. భారతీయ-అమెరికన్ అయిన శ్రీసైనీ మిస్ వరల్డ్ 2021లో యునైటెడ్ స్టేట్స్ తరపున రన్నరప్ గా నిలిచింది.
మిస్ ఇండియా మానస వారణాసి అనే హైదరాబాదీ అమ్మాయి టాప్ 13లో చేరింది. ఆమె వృత్తి రీత్యా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనలిస్ట్. హర్నాజ్ సంధు 21 సంవత్సరాల తర్వాత భారతదేశానికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న నెలల తర్వాత అందాల పోటీలో టాప్ 13లోకి మానస వారణాసి ప్రవేశించింది. ఈమె విజయం కోసం భారతదేశం ఆశలు పెట్టుకుంది. అయితే ఆమె టాప్ 6 లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయింది.
అమెరికా, పోలాండ్, ఇండోనేషియా, మెక్సికో, నార్తర్న్ ఐర్లాండ్, కోట్ డి ఐవరీ టాప్ 6లో చోటు సంపాదించిన దేశాలు. ఆ తర్వాత.. కరోలినా బిలావ్స్కా మిస్ వరల్డ్ 2021 విజేతగా నిలిచింది. భారత్ చివరిసారిగా 2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. అప్పుడు మానుషి చిల్లర్ టైటిల్ గెలుచుకుంది.