Begin typing your search above and press return to search.
అన్నంత పనీ చేస్తున్న మేకతోటి సుచరిత!
By: Tupaki Desk | 11 April 2022 8:21 AM GMTమంత్రి వర్గ విస్తరణ వైసీపీలో పెను చిచ్చు రేపుతోంది. ఎవరూ శాంతించేటట్లు లేరు. తమకు అన్యాయం జరిగింది అన్న భావనలో తాజా మాజీ మంత్రులు పలువురు ఉన్నారు. వారిలో అందరి కంటే ముందు వరసలో మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఉన్నారు. ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అన్నంత పనీ చేశారు.
ఆమెని సముదాయించేందుకు ఇంటికి వచ్చిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ చేతిలో ఆమె రాజీనామా లేఖ ఉంచారు. అయితే ఆమె రాజీనామా చేయేలేదు అని మీడియాకు తరువాత మోపిదేవి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తన తల్లి రాజీనామా చేసింది అని ఆమె కుమార్తె రిషిత మీడియాకు అదే టైమ్ లో తెలియచేయడం విశేషం.
ఈ అయోమయం ఇలా కొనసాగుతుండగానే మేకతోటి సుచరిత తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా అధికారికంగా తాజాగా ప్రకటించారు. ఆమె ప్రతిపాడు పార్టీ కార్యకర్తలతో సమావేశం అయిన మీదట తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక పార్టీని వీడిపోనని, తాను కొనసాగుతానని ఆమె స్పష్టం చేయడం విశేషం.
అదే సమయంలో పార్టీకి నష్టం చేకూర్చేలా ఎలాంటి నిర్ణయాలు పార్టీ నాయకులు తీసుకోవద్దు అని మేకతోటి క్యాడర్ కి సూచించడం గమనార్హం. మొత్తానికి మేకతోటి ఒక వ్యూహం ప్రకారం వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. ఆమెలో అసంతృప్తి తీవ్రంగానే ఉందని, దానికి సరైన భరోసా కోసం ఆమె చూస్తున్నారు అని చెబుతున్నారు.
మరి ఆమెతో జగన్ నేరుగా మాట్లాడుతారా లేక సజ్జల రామక్రిష్ణారెడ్డిని పంపుతారా అన్నది చూడాలి. ఏది ఏమైనా మేకతోటి వెనక్కి తగ్గరని పార్టీ క్యాడర్ అంటోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.