Begin typing your search above and press return to search.
భారత్ లో ఒమిక్రాన్ ఎక్స్ ఈ.. భయపడాల్సిన అవసరం లేదట!
By: Tupaki Desk | 12 April 2022 6:31 AM GMTచెనాలో పుట్టిన కరోనా మహమ్మారి... ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లతో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను బలిగొంది. కొత్త కొత్త వేరియంట్లతో రూపు మార్చుకుంటూ మళ్లీ ఫోర్త్ వేవ్ రూపంలో పంజా విసురుతోంది. అయితే ఈ ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ భారత్ లోనూ వెలుగు చూసింది.
గుజరాత్, మహారాష్ట్రలో ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. మరోసారి కరోనా వ్యాప్తిపై ఆందోళన రేగడంతో కొవిడ్ వర్కింగ్ గ్రూప్ స్పందించింది. కొత్తి వేరియంట్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని సూచించింది. అయితే ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ వల్ల రోగులు తీవ్ర సమస్యలను ఎదుర్కోవలసి వస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. కాకపోతే ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందనడంపై ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేసింది.
ఒమిక్రాన్ నుంచి ఎన్నో కొత్త రకాలు పుట్టుకొస్తున్నాయని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ చీఫ్ ఎ్క్ అరోఢా చెప్పారు. ఎక్స్ఈ తో పాటు ఇతర రకాలు కేవలం ఎక్స్ సిరీస్ లో భాగమే అన్నారు. ఇటువంటి వేరియంట్లు వస్తూనే ఉంటాయని.. భారత్ లో వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కాగా.. ఎక్స్ఈ వేరియంట్ తొలుత బ్రిటన్ లో వెలుగు చూసింది.
అనంతరం థాయ్ లాండ్. న్యూజిలాండ్ దేశాలకూ వ్యాపించింది. తాజాగా భారత్ లోనూ ఈ వేరియంట్ కేసులు గుజరాత్, మహారాష్ట్రల్లో వెలుగు చూశాయి. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే శక్తి కల్గి ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమిక్రాన్ లో ఇప్పటి వరకు ఉన్న ఇతర ఉత్పరివర్తనాల కంటే వ్యాపించే గుణం ఎక్స్ఈ వేరియంట్ కు దాదాపు 10 శాతం ఎక్కువ ఉన్నట్లు బ్రిటన్ పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
కానీ ప్రస్తుతానికి భారత్ లో ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది కొవిడ్ వర్కింగ్ గ్రూప్. కాకపోతే కరోనా రెండు డోసులు టీకాలను కచ్చితంగా తీసుకోవాలని... రెండో డోసు వేసుకొని 9 నెలలు గడిచిన తర్వాత బూస్టర్ డోసు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు.
కరోనా టీకానే మనకు శ్రీరామ రక్ష అని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ సభ్యులు తెలియజేస్తున్నారు. అలాగే వీటితో పాటు బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు, ఎక్కువ జనాలు ఉన్న చోట కచ్చితంగా మాస్కు ధరించాలని, బౌతిక దూరం పాటించాలని చెబుతున్నారు.