Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. చంద్ర‌బాబును ఇరికించాడుగా!

By:  Tupaki Desk   |   20 March 2022 11:30 AM GMT
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. చంద్ర‌బాబును ఇరికించాడుగా!
X
రాజ‌కీయాల్లో నాయ‌కులు చేసే వ్యాఖ్య‌లు.. ఒక్కొక్క‌సారి భ‌లే చిక్కులు తెస్తుంటాయి. లేనిపోని త‌ల నొప్పు లు కూడా నెత్తిన పెట్టుకున్న‌ట్టు అవుతుంది. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామమే.. ఏపీలోనూ చోటు చేసుకుందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీలో ప్ర‌భుత్వ ఉద్యోగులు.. కంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్‌(సీపీఎస్‌) ప‌థ‌కాన్ని ర‌ద్దు చేయాల‌ని.. ఎప్ప‌టి నుంచో కోరుతున్నారు. గ‌త చంద్ర‌బాబు హ‌యాంలోనే ఈ ప్ర‌తిపాద‌న వ‌చ్చింది. అయితే.. అప్ప‌ట్లోనే చంద్ర‌బాబు దీనిని ప‌క్క‌న పెట్టారు. దీంతో అప్ప‌టి విప‌క్ష నేత‌, వైసీపీ నాయ‌కుడు.. జ‌గ‌న్ దీనిని భుజాల‌కెత్తుకున్నారు.

త‌మ ప్ర‌భుత్వం రాగానే.. వారంలోనే సీపీఎస్‌ను ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీనిపై ఆశ‌లు పెట్టుకున్న ఉద్యోగులు జ‌గ‌న్‌ను అధికారంలోకి తేవ‌డంలో విశేషంగా క‌ష్ట‌ప‌డ్డారు. అయితే.. రెండున్న‌రేళ్లు గడిచినా... దీనిపై జ‌గన్ ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌య‌మూ తీసుకోలేదు. దీంతో ఉద్యోగులు ఇటీవ‌ల ఆందోళ‌న బాట ప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే.. ఉద్యోగుల వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో ఈ విష‌యంపై సీఎంజ గ‌న్‌కు అవ‌గాహ‌న లేద‌ని... అందుకే అలా ర‌ద్దు ప్ర‌క‌ట‌న చేశార‌ని.. స‌ల‌హాదారు స‌జ్జ‌ల చెప్పుకొచ్చారు. అంటే.. ఒక‌ర‌కంగా.. సీపీఎస్ ర‌ద్దు విష‌యంలో ప్ర‌భుత్వం దాట‌వేత ధోర‌ణి పాటిస్తోంద‌ని అంటున్నారు.

ఇదిలావుంటే.. ఈ విష‌యంపై తాజాగా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ నెల 14న మంగ‌ళ‌గిరి వేదిక‌గా నిర్వ‌హించిన‌.. జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా.. ప‌లు హామీలు గు ప్పించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము అధికారంలోకి వ‌స్తామ‌న్నారు. ఈ క్ర‌మంలో అధికారంలోకి రాగానే.. ప్ర‌భుత్వ ఉద్యోగుల పీఆర్సీని రివైజ్‌చేస్తామ‌న్నారు. అంతేకాదు.. ఉద్యోగులు ఎదురు చూస్తున్న సీపీఎస్ ను సైతం ర‌ద్దు చేస్తామ‌ని గ‌ట్టి హామీనే ప‌వ‌న్ గుప్పించారు. ఇదే ఇప్పుడు చంద్ర‌బాబుకు ఇబ్బందిగా మారింద‌ని అంట‌న్నారు ప‌రిశీల‌కులు.

అదేంటి ప‌వ‌న్ హామీ ఇస్తే.. చంద్ర‌బాబుకు ఏమైంద‌నే అనుమానం ఉందా? ఇక్క‌డే ఉంది కిటుకు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ వ్య‌తిరేక ఓటు ను చీల‌కుండా.. చూస్తాన‌ని.. ఇదే వేదిక సాక్షిగా.. ప‌వ‌న్ వ్యాఖ్యానించాడు. అంటే.. అన్ని పార్టీల‌నూ ఆయ‌న క‌లుపుకొని పోతాన‌ని చెప్ప‌క‌నేచెప్పారు. అంటే.. టీడీపీ .. జ‌న‌సేన‌లు క‌లిసి పోటీ చేయ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం ఉంది. దీనిని బ‌ట్టి..ప‌వ‌న్ ఇచ్చిన ప్ర‌తిహామీని .. సీఎంగా చంద్ర‌బాబు నెర‌వేర్చాలి. అంటే.. ఇప్పుడు ఇచ్చిన సీపీఎస్ ర‌ద్దు హామీని కూడా ఆయ‌నే నెర‌వేర్చాల్సి ఉంటుంది.

వాస్త‌వానికి సీపీఎస్ ర‌ద్దు చేసింది మ‌న్మోహ‌న్‌సింగ్ ప్ర‌భుత్వంలోనే. అప్ప‌ట్లోనే వైఎస్ సీఎం ఉన్న ప్పుడు.. అన్ని రాష్ట్రాల్లో ర‌ద్దు చేశార‌ని.. పార్ల‌మెంటులో బిల్లు తెచ్చి.. అదే కాంగ్రెస్ ప్ర‌భుత్వం అప్పుడు ఉన్న రాష్ట్రాల్లో ర‌ద్దు చేసింది. తాజాగా రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ల‌లో సీపీఎస్‌ను ర‌ద్దు చేశారు. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ కూడా తాము అధికారంలోకి వ‌చ్చాక సీపీఎస్ ర‌ద్దు చేస్తామ‌న్నారు. కానీ, ఇది నేరుగా ఆయ‌న చేసే ర‌ద్దు కాదు. ఎవ‌రు సీఎం పోస్టులో ఉన్నారో .. వారే చేయాల్సి ఉంటుంది. నిజానికి ఈ సీపీఎస్ ర‌ద్దు కార‌ణంగా.. వేల కోట్ల రూపాయ‌ల నిధులు అవ‌స‌రం. అస‌లే అంతంత మాత్రంగా ఉన్న ఏపీ ఆర్ధిక ప‌రిస్థితి నేప‌థ్యంలో ప‌వ‌న్ ఇచ్చిన హామీ .. చంద్ర‌బాబుకు గుదిబండ‌గా మారుతుంద‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.