Begin typing your search above and press return to search.

శాంతి చర్చల్లో విషం కలకలం.. చర్చల వద్ద ఏమీ తినొద్దు.. తాగొద్దు..!

By:  Tupaki Desk   |   29 March 2022 12:30 PM GMT
శాంతి చర్చల్లో విషం కలకలం.. చర్చల వద్ద ఏమీ తినొద్దు.. తాగొద్దు..!
X
రష్యా చరిత్ర చూస్తే ప్రత్యర్థులపై ‘విష ప్రయోగాలు’ అనేది ఇప్పటికీ ఓ మాయని మచ్చగా ఉంది. తాజాగా మరో విష ప్రయోగం బయటకు వచ్చింది. ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చల్లోని ప్రతినిధులపై విష ప్రయోగం జరిగింది. ఇది ఎవరు చేశారన్నది ఇంకా తేలలేదు.

మార్చి 3వ తేదీన ఉక్రెయిన్ -బెలారస్ సరిహద్దుల్లో జరిగిన చర్చల్లో రష్యా ఒలిగార్క్ రోమన్ అబ్రహమోవిచ్, ఉక్రెయిన్ ప్రతినిధిగా వచ్చిన ఆ దేశ పార్లమెంట్ డిప్యూటీ రుస్తెమ్ ఉమెరోవ్ అస్వస్థతకు గురికావడం సంచలనమైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ చర్చల సమయంలో ఉక్రెయిన్ బృందం సభ్యుల కళ్లు ఎర్రగా మారిపోయి కొద్దిసేపు చూపు కూడా దెబ్బతింది. తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. ఈ ఘటన తర్వాత అబ్రహమోవిచ్, ఉమెరోవ్ లు చికిత్స కోసం టర్కీలోని ఇస్తాంబుల్ కు వెళ్లారు. వీరిపై ఏ రకం విషాన్ని ప్రయోగించారో ఇంకా వెల్లడి కాలేదు.

చర్చలకు ఇష్టపడని రష్యా అతివాదుల హస్తం దీని వెనుక ఉండొచ్చని ఓ నివేదికను ఉటం కిస్తూ మీడియాలు చెప్పుకొచ్చాయి. రుస్తెమ్ ఉమెరోవ్ మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చారు.

ఈ ఆరోపణలతో శాంతి చర్చలు మొత్తానికే ఎసరు వచ్చే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అందుకే దీన్ని దాచేసినట్టుగా భావిస్తున్నారు. టర్కీ జోక్యంతో రెండు వారాల తర్వాత మరోసారి రష్యా-ఉక్రెయిన్ బృందాలు ఇస్తాంబుల్ లో శాంతి చర్చలు జరుపున్నారు. రష్యాకు చెందిన రోమన్ అబ్రహమోవిచ్ ఈ శాంతి చర్చల్లో ఉక్రెయిన్ కోరిక మేరకు అనధికారికంగా మధ్యవర్తి పాత్ర వహిస్తున్నారు.

రష్యా ఆక్రమణ మొదలుపెట్టినప్పటి నుంచి అమెరికా, యూకే, ఐరోపా సమాధ్యలు రోమన్ పై ఆంక్షలు విధించాయి. రోమన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అత్యంత సన్నిహితుడుగా చెబుతున్నారు. కానీ శాంతి చర్చల్లో చొరవ తీసుకుంటున్న రోమన్ కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికాను ఒప్పించి చర్చలు జరిపేలా చేశాడు.