Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఢిల్లీ దూత ప్రకాశ్ రాజ్.. లెక్కలు చాలానే ఉన్నాయ్
By: Tupaki Desk | 21 Feb 2022 7:30 AM GMTగ్రౌండ్ వర్కు పక్కాగా జరిగితే.. దాని ఫలితమే వేరుగా ఉంటుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన సందర్భంగా ఇదే విషయం బయటకు వచ్చింది. ప్రధాని మోడీపై ఆయన యుద్ధాన్ని ప్రకటించటం.. ఇందులో భాగంగా తన టీంను సెట్ చేసుకోవటానికి వీలుగా ఆయన ఎంత పక్కాగా ప్లాన్ చేశారనటానికి నిలువెత్తు నిదర్శనం.. ప్రకాశ్ రాజ్ ఎంట్రీనేనని చెబుతున్నారు. కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో ప్రకాశ్ రాజ్ సడన్ ఎంట్రీ అందరిని అవాక్కు అయ్యేలా చేసింది. ఒక విధంగా మోడీ అండ్ కోకు సరైన సంకేతాల్ని ఇచ్చేలా కేసీఆర్ ప్లాన్ చేశారని చెప్పాలి.
నిజానికి కేసీఆర్ కు ప్రకాశ్ రాజ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం చాలా మందికి తెలీదు. అలాంటిది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ వేళ ప్రకాశ్ రాజ్ కీలకంగా వ్యవహరించటం.. ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో జరిగిన భేటీలోనూ ఈ విలక్షణ నటుడు ప్రధాన పాత్రను పోషించారు. ఇదంతా చూస్తే.. రానున్న రోజుల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల ఎపిసోడ్ లో ప్రకాశ్ రాజ్ ముఖ్యనేతగా మారనున్నారా? అన్నదిప్పుడు చర్చగా మారింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో జరిగిన భేటీలో తనతో పాటు వచ్చిన వారిని పరిచయం చేసిన క్రమంలో ప్రకాశ్ రాజ్ ను పరిచయం చేసిన వైనం కాస్తంత భిన్నంగా ఉందంటున్నారు. ప్రకాష్ రాజ్ ను ఢిల్లీలో తన దూతగా కేసీఆర్ ఎంపిక చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి బోలెడన్ని కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు.. త్వరలోనే రాజ్యసభ సీటును ప్రకాశ్ రాజ్ కు అప్పజెప్పి ఢిల్లీకి పంపుతారని.. జాతీయ స్థాయిలో వివిధ వర్గాలకు చెందిన నేతల్ని ఒక గూటికి చేర్చే పనిలో ఆయన కీలక భూమిక పోషించినున్నట్లుగా చెబుతున్నారు.
జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య నాటి నుంచి మోడీ సర్కారుపై ప్రకాశ్ రాజ్ పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. జంకు బొంకు లేకుండా ప్రధానిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయటానికి ఆయన వెనుకాడటం లేదు. ఇదే కాకుండా భావజాలం విషయంలోనూ మోడీ పరివారానికి పూర్తి భిన్నమైన వాదనలను వినిపించే ప్రకాశ్ రాజ్.. గతంలో కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. ఈ మధ్యన‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీ చేసి ఓటమి పాలు కావటం తెలిసిందే.
దక్షిణాది రాష్ట్రాల్లోని పలువురు నేతలతో.. పార్టీలతో ప్రకాశ్ రాజ్ కు ఉన్న సంబంధాలతో పాటు.. జాతీయ స్థాయిలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా గళం విప్పేందుకు అవసరమైన సత్తా ప్రకాశ్ రాజ్ కు ఉందన్న ఆలోచనతో ఆయన్ను ఎంపిక చేసుకున్నారని చెప్పొచ్చు. కేకే లాంటి నేతలు ఉన్నా.. వారంతా ఫక్తు రాజకీయ నేతలు తప్పించి.. విధానాల పరంగా.. ఇష్యూ బేస్డ్ గా మోడీ సర్కారు లోపాల్ని ఎత్తి చూపటంలో ఉన్న ఇబ్బందిని గుర్తించిన కేసీఆర్.. అందుకు సరిపోయే సత్తా ఉన్న ప్రకాశ్ రాజ్ ను ఎంపిక చేసుకున్నారని చెబుతున్నారు.
గతానికి భిన్నంగా ఈసారి మోడీపై పోరుకు సర్వం సిద్ధం చేసుకున్న కేసీఆర్.. అందుకు తగ్గట్లే ప్రకాశ్ రాజ్ లాంటి అస్త్రాల్ని సందర్భానికి అనుగుణంగా బయటకు తీస్తారన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. రానున్న రోజుల్లో కేసీఆర్ ఢిల్లీ దూతగా ప్రకాశ్ రాజ్ మారటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.