Begin typing your search above and press return to search.
పీఆర్సీ వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
By: Tupaki Desk | 23 Feb 2022 8:31 AM GMTపీఆర్సీ వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీతం నుంచి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పీఆర్సీ నివేదికను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఉద్యోగులు వేసిన పిటీషన్ పై కౌంటర్ కూడా దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను పిటీషనర్ కు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
పీఆర్సీని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ పై గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులు జీతాల నుంచి ఎటువంటి రికవరీలు చేయవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పీఆర్సీ కొత్త జీవోలను మూడు వారాల పాటు యథాస్థితిలో ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పీఆర్సీ వలన తమకు అన్యాయం జరుగుతుందనేది పిటీషనర్ కృష్ణయ్య వాదించారు. జీతాలు, అలవెన్సులో తగ్గుదల కనిపించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పీఆర్సీ జీవోలపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇక పీఆర్సీలో జీతాలు తగ్గాయంటూ హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై ఇటీవలే విచారణ జరిగింది. జీవోలో పేర్కొన్న విధంగా రికవరీ లేకుండా జీతాలు వేయాలని ప్రభుత్వానికి కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. జీతాల్లో రికవరీ చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. పీఆర్సీపై నియమించిన అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వలేదని న్యాయవాది రవితేజ వాదనలు వినిపించారు. జీవోల్లో ఏరియర్స్ కట్ చేయడాన్ని ప్రస్తావించారు.
కాగా ఈ వ్యవహారంలో అనేక అంశాలు ముడిపడి ఉండడంతో ప్రభుత్వం సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది.ఈరోజు విచారణలో పీఆర్సీ వ్యవహారంపై ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది.