Begin typing your search above and press return to search.

మ‌న‌కీ.. ప‌వ‌న్‌కీ.. పోలికెందుకులే.. రాజా..!

By:  Tupaki Desk   |   2 March 2022 1:30 PM GMT
మ‌న‌కీ.. ప‌వ‌న్‌కీ.. పోలికెందుకులే.. రాజా..!
X
రాజ‌కీయాల్లో పోలిక‌లు స‌హ‌జ‌మే అయినా.. కొంద‌రితో కొంద‌రిని పోల్చేందుకు ఒకింత ఇబ్బంది ప‌డాల్సిన పరిస్థితి ఉంటుంది. వైసీపీ నేత‌లు అనే విధంగా చూస్తే.. జ‌గ‌న్‌తో టీడీపీ అధినేత చంద్ర‌బాబును పోల్చ‌లేం. అదేవిధంగా బీజేపీతో కాంగ్రెస్‌ను కూడా పోల్చే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే.. జ‌గ‌న్ రాజకీయంగా ఎదిగిన పరిస్థితులు వేరు. కానీ, చంద్ర‌బాబు కాలేజీ నుంచి రాజకీయాల్లో అడుగు అడుగు ఎదిగారు. స‌రే! ఈ విష‌యాన్ని అలా ఉంచితే.. ఇప్పుడు వైసీపీకి చెందిన కీల‌క నాయ‌కుడు.. రెబల్ నేత‌.. ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. త‌న‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌తో పోల్చుకున్నారు.

అయితే.. అనూహ్యంగా నిన్న‌టి వ‌ర‌కు ఆయ‌న‌ను స‌మ‌ర్ధించిన‌.. కొంద‌రు జ‌న‌సేన నాయ‌కులు.. `ఇలా పోలికలు ఎందుకులే రాజా!`` అని కామెంట్లు పెడుతున్నారు. దీనికి కార‌ణం చూస్తే.. ప‌వ‌న్ పార్టీ పెట్టుకుని.. స్వ‌తంత్రంగా ఎదుగుతున్నారు. కొన్ని పార్టీల‌తో పొత్తు ఉన్నా.. ఆయ‌న ఒక పార్టీలో ఉండి.. మ‌రో మాట మాట్లాడ‌డం లేదు.

త‌ను అనుకున్న‌ది ఆది నుంచి వినిపిస్తు న్నారు. అది టీడీపీతో పొత్తులో ఉన్నా.. ఇటు బీజేపీతో పొత్తులో ఉన్నా.. ఒకే విధంగా వైసీపీనే టార్గెట్ చేసుకుని వ్య‌వ‌హ‌రిస్తు న్నారు. ఎక్క‌డా బ్యాలెన్స్ త‌ప్ప‌లేదు. ఒక్కొక్క‌సారి.. ఆయ‌న విమ‌ర్శ‌లు త‌గ్గించారేమో.. కానీ.. త‌న వ్యూహాన్ని మాత్రం వ‌దులు కోలేదు. మ‌రి ఇలాంటి నాయ‌కుడితో రాజుగారు ఎందుకు పోల్చుకుంటున్నారు? అనేది ప్ర‌శ్న‌.

తాజాగా ర‌ఘురామ‌రాజును సీఐడీ అధికారులు వెంటాడ‌తున్నార‌ని.. ఆయ‌నే ల‌బోదిబో మ‌న్నారు. ఏదో కార్య‌క్ర‌మం కోసం.. తాను హైద‌రాబాద్ వ‌చ్చిన‌ట్టు చెప్పారు. ఈ క్ర‌మంలో త‌న‌ను మ‌రోసారి అరెస్టు చేసేందుకు.. సీఐడీ పోలీసులు ప్ర‌య‌త్నించార‌ని.. త‌న ఇంటి వ‌ద్ద కాప‌లా కూడా పెట్టార‌ని అయితే.. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే తాను త‌ప్పించుకుని చాక‌చ‌క్యంగా ఢిల్లీకి వెళ్లిపోయాన‌ని అన్నారు. స‌రే.. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

అయితే.. ఆయ‌న త‌న కేసుకు.. ఏపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ.. భీమ్లా నాయక్ కేసుకు ముడిపెట్టారు. ఏపీ ప్ర‌భుత్వం.. త‌న‌పై నిఘా పెట్టింద‌ని.. ప‌వ‌న్‌పై ప‌గ ప‌ట్టింద‌ని.. చెప్పుకొచ్చారు. రైమింగ్ బాగుం ద‌ని.. ఈ ప‌దాలు వాడినా.. విష‌యంలో ప‌స‌లేద‌ని .. అంటున్నారు జ‌న‌సేన నాయ‌కులు.

ఎందుకంటే.. ర‌ఘురామ రాజు కేసు వేరు. ఆయ‌న త‌న‌కు రాజ‌కీయంగా అవ‌కాశం క‌ల్పించిన పార్టీని బ‌జారుకు ఈడ్చే ప‌ని చేశారు. కానీ, ప‌వ‌న్ ఎక్క‌డా త‌న‌ను న‌మ్మిన వారిని, త‌న‌కు రాజ‌కీయంగా పుంజు కునేలా ఛాన్స్ ఇచ్చిన వారి(ఎవ‌రైనా ఉంటే)కి ఎక్క‌డా దెబ్బ‌కొట్టలేద‌ని.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కూడా ఆక్షేపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఏదైనా ఉంటూ.. నువ్వు, నీ పార్టీ చూసుకో.. మా నాయ‌కుడితో ఎందుకు పోటీ? అని ప్ర‌శ్నిస్తున్నారు. ప‌వ‌న్‌ను అడ్డం పెట్టుకుని.. రాజ‌కీయం చేయ‌డం ఎందుకు? అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి దీనిపై ర‌ఘురామ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.