Begin typing your search above and press return to search.
రష్యా కొత్త క్షిపణి ప్రయోగం.. భూమిపై ఎక్కడైనా ఇక అణుబాంబులేయవచ్చు
By: Tupaki Desk | 21 April 2022 7:29 AM GMTరష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ముగిసినట్లే అనుకున్నారు. కానీ కొన్ని పరిస్థితులను చూస్తే పోరు మరింత తీవ్రమవుతున్నట్లు తెలుస్తోంది. ఏకధాటిగా రష్యా ఉక్రెయిన్ పై దాడికి తెగబడుతుండడం చూస్తే రష్యా యుద్ధాన్ని ముగించినట్లు కనిపించడం లేదు. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తున్న పాశ్చాత్య దేశాలపై విరుచుకుపడ్డాడు. అయితే ఖండాతర క్షిపణి ప్రయోగం తరువాత ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
కాగా రష్యా ప్రయోగించిన క్షిపణితో ప్రపంచంలోని ఏ దేశం మీదనైనా ప్రయోగించవచ్చు. ఈ ఖాండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించి శత్రుదేశాలను డిఫెన్స్ లో పడేసింది రష్యా. ప్రపంచంలోనే సరికొత్త అణ్వాయుధ సామథ్యం గల క్షిపణి అంటూ వెల్లడించారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సర్మత్ అణ్వాయుధ క్షిపణిని మొదటిసారిగా వాయువ్య రష్యాలోని ప్లెసెట్స్క్ నుంచి పరీక్షించారు. ఈ క్షిపణి అత్యున్నత వ్యూహాత్మక సాంకేతిక లక్షణాలను కలిగి ఉన్నట్లు పుతిన్ తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలపైకి ఈ క్షిపణి వెళ్లగలని రష్యా తెలిపింది. దీంతో రష్యా క్షిపణిని చూసి ఇప్పుడు అమెరికా, పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
దాదాపు 6వేల కిలోమీటర్ల దూరంలో కమ్ చట్కా ద్వీపకల్పంలోని లక్ష్యాలను ఇది ఛేదించినట్టు పుతిన్ సైన్యం వెల్లడించింది. ఈ క్షిపణి పరీక్షతో పశ్చిమ దేశాలను రష్యా ఇరకాటంలో పడేసింది. యుద్ధం మధ్యలో రష్యా చేసిన అణ్వాయుధ ప్రయోగంపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కాగా పరీక్ష పూర్తయిన రష్యా అణు దళాల సామర్థ్యం పెరిగిందని.. కొత్త క్షిపణి పరీక్ష విజయవంతం అయ్యిందని రోస్కోస్మోస్ స్పేస్ ఏజెన్సీ అధిపతి డిమిత్రి రోగోజిన్ తెలిపారు.
ఇక దాదాపు రెండు నెలల కిందట ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభించిన రష్యా భీకర దాడి కొనసాగిస్తోంది. అయితే కొన్ని రోజుల తరువాత శాంతి చర్చల ద్వారానే యుద్ధం ముగుస్తుందని చెప్పి ఉక్రెయిన్ తో చర్చలు జరిపింది రష్యా. రష్యా డిమాండ్ కు ఉక్రెయిన్ అంగీకరించడంతో పాటు రష్యా సైతం ఉక్రెయిన్ పెట్టిన షరతులకు ఒప్పుకుంది. ఈ చర్చల తరువాత రష్యా సేనలు ఉక్రెయిన్ ను వదిలి వెళ్లారు. ఆ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. కానీ ఆ తరువాత రైల్వేస్టేషన్ పై దాడి జరిగిందని ఉక్రెయిన్ ఆరోపించడంతో రష్యాత తమకు సంబంధం లేదని వాదించింది. అయితే రష్యా మాత్రం యుద్దం నుంచి నిష్క్రమించినట్లు కనిపించడం లేదు.
మరోవైపు యూరప్ దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధాలతో పాటు రక్షణ అవసరాలను కూడా సాయం చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ సైతం యుద్ధం కొనసాగింపుగానే చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు రష్యా అణ్వాయుధాలను మోసుకెళ్లగల సర్మత్ ఖండాంతర క్షపణి ప్రయోగం చేసింది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో రష్యాకు అదనపు బలం చేకూరినట్లయింది. దీని ఉద్దేశంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. 'మమ్మల్ని బయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.. మమ్మల్ని భయపెట్టడం మీ తరం కాదు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆపై కయ్యానికి కాలు దువ్వండి' అంటూ రష్యా అధ్యక్షుడు అనడం సంచలనంగా మారింది.
ఇన్విన్సబుల్ గా పిలుస్తున్న దీనిని రష్యా మలితరం క్షిపణిగా అభివర్ణిస్తున్నారు. అంతకుముందు రష్యా ఇదే తరహా కింజల్, అవన్ గార్డ్ హైపర్ సానిక్ క్షిపణులను ప్రయోగించింది. గత నెలలో ఉక్రెయిన్ పై దాడి సమయంలో తొలిసారి రష్యా కింజల్ క్షిపణిని ప్రయోగించింద. ఈ క్షిపణిని ప్రయోగించేందుకు రష్యా బలగాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. ఇక సర్మత్ క్షిపణి ప్రయోగం సక్సెస్ కావడంతో రష్యా అధ్యక్షుడు దీనిని రూపొందించిన శాస్త్రవేత్తలు దీని కోసం పనిచేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఈ క్షిపణి ప్రయోగం సక్సెస్కావడం పుతిన్ సైనికులను అభినందించారు.