Begin typing your search above and press return to search.
#RussiaUkrainewar: ఉక్రెయిన్ యుద్ధం: బంకర్ లో తెలుగు విద్యార్థులు భిక్కుభిక్కు
By: Tupaki Desk | 25 Feb 2022 10:31 AM GMTఉక్రెయిన్ పై రష్యా దాడులు రెండోరోజు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులతో అక్కడున్న తెలుగు విద్యార్థులు భిక్కుభిక్కుమంటున్నారు. తమను ఎలాగైనా సరే తీసుకెళ్లాలంటూ భారత ఎంబసీని వేడుకుంటున్నారు.
మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని జమ్మిగడ్డకు చెందిన కందుకూరి వైష్ణవి విన్నిట్సియా నగరంలోని నేషనల్ పిరిగోవ్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది.
ఉక్రెయిన్ పై రష్యా దాడులు ప్రారంభించగానే బంకర్ లోకి వెళ్లాలంటూ వైష్ణవికి చెందిన యూనివర్సిటీ నుంచి ఫోన్ వచ్చింది. దాంతో ఆమె తన స్నేహితులతో కలిసి తమ నివాస స్థలానికి దగ్గరల్లో ఉన్న బంకర్ లోకి వెళ్లింది.
అక్కడి నుంచి వీడియో తీసి తమ తల్లిదండ్రులకు పంపించింది. ప్రస్తుతం తామందరం క్షేమంగానే ఉన్నామని.. యూనివర్సిటీ అధికారుల సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉన్నామని.. ఎవరూ భయపడవద్దని తల్లిదండ్రులకు అక్కడి విద్యార్థులు తెలిపారు.
ఉక్రెయిన్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 1500 మంది ఉక్రెయిన్ విమానాశ్రయంలో ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారు. కొన్నేళ్లుగా ఉభయ రాష్ట్రాల నుంచి ఉక్రెయిన్ కు ఏటా వందలాది మంది మెడిసిన్ చదివేందుకు ఉక్రెయిన్ వెళ్తున్నారు. అయితే ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలుగు విద్యార్థులను వెనక్కి వెళ్లాలని సూచించారు. కానీ వారు అక్కడి నుంచి వెనక్కి రావడానికి నిరాసక్తి చూపిస్తున్నారు. అందుకు విమాన ఛార్జీలు భారీగా ఉండడమే కారణమని అంటున్నారు. ఇక కొందరు తిరిగి వచ్చేందుకు రెడీ అయినా మార్చి వరకు గానీ టిక్కెట్లు దొరకలేదు.
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న బాంబుల వర్షంతో ఇక్కడి ఇంటర్నెట్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అవకాశం దొరకడం లేదు. అయితే స్థానికంగా అండగా నిలవాల్సిన అధికారులు తమను నిండా ముంచేశారని ఆవేదన చెందుతున్నారు. యుద్ధం వస్తుందన్నవిషయం అవాస్తవమని చెబుతూ తప్పుడు సమాచారం చేశారన్నారు. అందువల్లే తమ దేశాలు వెనక్కి రమ్మని పిలిచినా కొందరు తిరుగుముఖం పట్టలేదు. కానీ ఇప్పుడు ఆందోళనకర పరిస్థితులు నెలకొనడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కనీస సరుకులు కూడా నిల్వచేసుకోకుండానే యుద్ధం సాగుతుండడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని అంటున్నారు.