Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఆ మంత్రుల‌కే మార్క్స్ ప‌డ‌తాయా ?

By:  Tupaki Desk   |   3 March 2022 10:30 AM GMT
జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఆ మంత్రుల‌కే మార్క్స్ ప‌డ‌తాయా ?
X
వైసీపీ మంత్రుల‌లో ఎవ్వ‌రికీ రాని అవ‌కాశం శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన మంత్రి సీదిరి అప్ప‌ల్రాజుకు వ‌చ్చింది.వ‌చ్చింది అనే క‌న్నా వ‌రించింది అని రాయ‌డ‌మే స‌బ‌బు.మొద‌టి సారి ఎమ్మెల్యే అవ్వ‌గానే అనూహ్యంగా మంత్రి అయ్యారాయ‌న. సొంత సామాజిక‌వర్గం కు సంబంధించిన మ‌త్స్యకార శాఖ‌తో పాటు ప‌శు సంవ‌ర్థ‌క శాఖ ను నిర్వ‌ర్తిస్తున్న సీదిరి అప్ప‌ల్రాజుకు దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి నిర్వ‌హించిన ఐటీ,ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ను అనూహ్య రీతిలో అప్ప‌గించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. క్యాబినెట్ లో సీనియ‌ర్ మంత్రులు ఉన్నా వారిని కాద‌ని జూనియ‌ర్ కు ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ శాఖ‌ను అప్ప‌గించ‌డం,అది కూడా వివాదాల‌కు త‌రుచూ కార‌ణం అవుతున్న సీదిరికి ఇవ్వ‌డం అన్న‌ది సంచల‌నాత్మ‌క నిర్ణ‌య‌మే అని చెప్పాలి.

ఇటీవ‌ల సీనియ‌ర్ మంత్రులెవ్వ‌రి విష‌య‌మై కూడా జ‌గ‌న్ అంత సంతృప్తిగా లేరనే తెలుస్తోంది.మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ చేయాల‌న‌కుంటున్న‌ప్పుడు కూడా ఈ సారి పాత ముఖాల‌ను అన్నింటినీ ప‌క్క‌న బెట్టాల‌ని ఆలోచిస్తున్నారు.ఈ క్ర‌మంలో అధికారుల ద‌గ్గ‌ర దూకుడుగా ఉంటూ నిర్ణ‌యాల‌ను కూడా అంతే వేగంతో తీసుకునే సీదిరి అప్ప‌ల్రాజుకు జోడు ప‌ద‌వులు అప్ప‌గించ‌డం క్యాబినెట్ లో చ‌ర్చ‌కు తావిస్తోంది.

ఇప్ప‌టికే ఒడిశాతో నెలకొన్న కొన్ని స‌రిహ‌ద్దు వివాదాల‌ను ప‌రిష్క‌రిచండంతో జ‌గ‌న్ ద‌గ్గ‌ర సీదిరి మంచి మార్కులే కొట్టేశారు.సీనియ‌ర్ల క‌న్నా బ‌లంగా జ‌గ‌న్ చెప్పిన విధంగా పార్టీ వాయిస్ ను వినిపిస్తున్నారు.వివాదాలున్నా కూడా ప‌నితీరు కూడా మిగ‌తా మంత్రుల క‌న్నా స‌మ‌ర్థంగా ఉందన్న‌ది జ‌గ‌న్ భావ‌న కావొచ్చు.అందుకే ఆయ‌న సీనియ‌ర్లను కాద‌ని పెద్దిరెడ్డి లాంటి లీడ‌ర్లు ఉన్నా కూడా సీదిరికే జోడు ప‌ద‌వులు అందించారు.ఓ విధంగా ఈ నిర్ణ‌యం కాస్త స‌వాలు లాంటిదే! ఎందుకంటే మంత్రి గౌతం రెడ్డి ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హించారు.

కొత్తగా ఆయ‌న స్థానంలో ఎవ్వరు వ‌చ్చినా ఆ స్థాయిలో ప‌నిచేయాలి.ముఖ్యంగా ఐటీ ప‌రంగా కూడా ఏపీకి పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నాలు కూడా ముమ్మ‌రంగానే చేశారు. అందుకు ఆయ‌న‌కు ఉన్న ఉన్న‌త విద్యా నేప‌థ్యం ఎంత‌గానో స‌హ‌క‌రించింది.ఆయ‌న స్థాయిలో రాణించేందుకు సీదిరి ఒక్క‌రే స‌బ‌బు అని భావించారో ఏమో కానీ ఇక‌పై ఆయ‌న మోయాల్సిన బాధ్య‌త అతి క్లిష్ట‌మైనది అన్న‌ది సుస్ప‌ష్టం.అయినా కూడా సీదిరి ఈ స‌వాలును స్వీక‌రించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకుని రావాల్సిందే! అప్పుడే జ‌గ‌న్ ఆయ‌న భుజ‌స్కందాల‌పై నిలిపిన బాధ్య‌త‌ల‌కు ఓ అర్థ‌వంతం అయిన సాకారం ద‌క్కుతుంది.సార్థ‌క‌త చేకూరుతుంది.అందుకు స్వ‌భావ రీత్యా ఉన్న దూకుడును మంత్రి సీదిరి త‌గ్గించుకోవ‌డం ఇవాళ అత్యావ‌శ్య‌కం.

వాస్త‌వానికి పెద్ది రెడ్డి, బొత్స లాంటి సీనియ‌ర్ల‌ను ఆయ‌న పెద్ద‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేదు.బొత్స‌ను ఎప్పుడో ప్రాధాన్యంలో తీసుకోవ‌డం మానుకున్నారు అన్న వార్త‌లు కూడా అప్ప‌ట్లో వ‌చ్చాయి.చాలా కాలం ఆయ‌న జ‌గ‌న్ వ‌ర్గానికి దూరంగానే ఉన్నారు. ఇక ధ‌ర్మాన కృష్ణ దాసును కూడా జ‌గ‌న్ పెద్ద‌గా ప‌రిగ‌ణించ‌డం లేదు.సీనియ‌ర్ల‌లో ఒకరైన పెద్దిరెడ్డి ఇప్ప‌టికే కీల‌క పంచాయ‌తీ రాజ్ శాఖ చూస్తున్నారు క‌నుక ఆయ‌నకు మ‌రో పెద్ద శాఖ ఇవ్వ‌డం స‌బ‌బు కాద‌ని భావిస్తున్నారు.

ఎలానూ రేపు ఉప ఎన్నిక అయ్యాక మేక‌పాటి కీర్తి రెడ్డి (గౌతం రెడ్డి భార్య‌) కే సంబంధిత శాఖ‌లు అప్ప‌గించడం ఖాయం క‌నుక ఈ కొద్దికాలానికి సీదిరి అప్ప‌ల్రాజు అయితే బాగుంటుంది అన్న‌ది జ‌గ‌న్ ఆలోచ‌న మ‌రియు వ్యూహం కూడా!ఆ విధంగా ఇంకొంద‌రు జూనియ‌ర్లు కూడా బాగా ప‌నిచేసేందుకు,వారితో ప‌నిచేయించేందుకు కూడా అవ‌కాశం ఉంటుంద‌ని కూడా జ‌గ‌న్ భావ‌న కావొచ్చు.ఏదేమ‌యిన‌ప్ప టికీ వివాదాల‌తో,మ‌రీ!ముఖ్యంగా అధికారుల‌తో వాగ్వాదాలు న‌డుపుతూ త‌రుచూ మీడియాలో నిలిచే సీదిరికి ఇది ఓ గొప్ప కానుక కావొచ్చు.ఇదే స‌మ‌యంలో సీనియ‌ర్ల హ‌వాకు ఓ విధంగా చెక్ పెట్టిన విధంగా కూడా ఈ నిర్ణ‌యం అన్న‌ది ఉండ‌వ‌చ్చు.