Begin typing your search above and press return to search.
రెండుసార్లు పాము కాటుకు తప్పించుకున్న టీనేజర్ మూడోసారి బలైంది
By: Tupaki Desk | 21 March 2022 2:30 AM GMTదేవుడు ఉన్నాడా? లేడా?అన్నది ఎడతెగని వాదన. అలానే పాములు..వాటి పగలు.. వెంటాడి మరీ కొందరిని కాటేయటం లాంటివి విన్నంతనే నమ్మబుద్ధి కాదు. కానీ.. కళ్లారా కొన్ని ఉదంతాల్ని చూసినప్పుడు.. తెలుసుకున్నప్పుడు నిజమేనేమో? అన్న భావన కలుగుతుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది.
ఆదిలాబాద్ మండలంలోని బెదోడు గ్రామానికి చెందిన ప్రణాళి కాలేజీ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు బాలేరావు సుభాష్ - రంజనలు. ఏమైందో ఏమో కానీ.. ఈ టీనేజర్ ను గడిచిన ఏడు నెలలుగా ఒక పాము వెంటాడుతోంది.
ఇప్పటికే రెండుసార్లు ఆ పాము కాటేసినా.. ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఎందుకిలా జరుగుతుందో అర్థం కాని పరిస్థితి.
తాజాగా హోలీ వేడుకల సందర్భంగా స్నేహితులతో పండుగను జరుపుకోవాలనుకున్న టీనేజర్ ప్రణాళి పాముకాటుకు గురై మరణించింది. హోలీ వేళ.. తన కాలేజీ బ్యాగులో ఉంచిన రంగుల కోసం చేతిని లోపలకు పెట్టిన ఆమెను.. లోపలున్న పాము కాటేసింది. దీంతో.. ఆమెను హుటాహుటిన రిమ్స్ కు తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె.. మరణించింది. గడిచిన ఏడు నెలల వ్యవధిలో సదరు పాము కాటుకు గురి కావటం ఇది మూడోసారిగా చెబుతున్నారు.
గతంలో రెండుసార్లు పాము కాటుకు గురైనప్పటికీ ఆమె తప్పించుకోగలిగింది. కానీ.. మూడోసారి మాత్రం ఆమె మృత్యువు ఒడికి చేరుకుంది. ఈ వైనం స్థానికంగా సంచలనంగా మారింది.