Begin typing your search above and press return to search.

టీడీపీతో దోస్తీకి.. బీజేపీ కూడా సై.. మారుతున్న మాట‌లు.. తాజాగా సోము ఏమ‌న్నారంటే

By:  Tupaki Desk   |   21 March 2022 9:31 AM GMT
టీడీపీతో దోస్తీకి.. బీజేపీ కూడా సై.. మారుతున్న మాట‌లు.. తాజాగా సోము ఏమ‌న్నారంటే
X
ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయా? కొత్త పొత్తుల దిశ‌గా పాత మిత్రులు అడుగులు వేస్తున్నా రా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో... అవి ఎప్పుడు వ‌చ్చినా.. అధికార వైసీపీని గ‌ద్దె దింప‌డ‌మే ల‌క్ష్యంగా పార్టీలు ఏకీ కృతం అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌భ‌లో పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చ‌బోనివ్వ‌న‌ని చెప్పారు. అయితే... ఇది అనుకున్నంత ఈజీకాదు. ఎలాగంటే.. ప్ర‌స్తుతం ఏ పార్టీకి ఆ పార్టీ.. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేశాయి.

అయితే.. వ‌చ్చేఎన్నిక‌ల్లో ఈ పార్టీల‌న్నీ కూడా ఏక‌తాటిపైకి రావాలి. అప్పుడే. ప్ర‌బుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చ‌కుండా.. ఉండేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితి టీడీపీని తమ‌ద‌రికి రాన‌నివ్వ‌బోమ‌ని.. బీజేపీ చెబుతోంది. అంటే.. గ‌త ఎన్నిక‌ల‌కుముందు చంద్ర‌బాబు చేసిన కొన్ని ప‌నుల తో బీజేపీ అధిష్టానం హ‌ర్ట్ అయింద‌నేది బీజేపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టితెలుస్తోంది. అందుకే, ఇన్నా ళ్లు మౌనంగా ఉంది. ఇక‌, టీడీపీని తీసుకుంటే.. గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసి ఓడిపోయామ‌న‌నే ఆవేద‌న ఉంది. ఈ నేప‌థ్యంలో పొత్తుల‌కు ఆ పార్టీ సిద్ధంగానే ఉంది.

ఇక‌, జ‌న‌సేన కూడా టీడీపీతో క‌లిసి ప‌నిచేసేందుకు రెడీ అనే సంకేతాలు ఇచ్చింది. ఇక‌, తేలాల్సింది క‌మ‌లం గూటి వ్య‌వ‌హార‌మే. అందుకే.. తెలివిగా..జన‌సేన అధినేత ప‌వ‌న్ .. ఈ విష‌యాన్ని బీజేపీ గూటికే నెట్టేశారు. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నాన‌ని చెప్పారు. అంటే.. బీజేపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తు లపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాల‌నేది ప‌వ‌న్ ఉద్దేశం. ప‌రోక్షంగా టీడీపీ విష‌యంలో బీజేపీ తీసుకునే నిర్ణ‌యాన్ని తాను నిర్ణ‌యం తీసుకుంటాన‌ని.. జ‌న‌సేనాని చెప్ప‌క‌నే చెప్పార‌న్న మాట‌.

దీనిని బ‌ట్టి.. బీజేపీ.. టీడీపీతో క‌లిసేందుకు సిద్ధ‌ప‌డాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. అప్పుడే.. జ‌న‌సేనాని చెప్పిన వ్యూహం స‌క్సెస్ అవుతుంది. ఇక‌, బీజేపీ వ్య‌వ‌హారాన్ని తీసుకున్నా.. ఈ పార్టీ కూడా వైసీపీపై నిప్పు లు చెరుగుతోంది. పార్టీని అధికారంలోకి దింపేస్తామ‌ని.. అంటోంది. అయితే.. జ‌న‌సేన‌తోఎలానూ పొత్తు ఉన్న నేప‌థ్యంలో ఈ రెండు పార్టీలు క‌లిసి పోటీ చేస్తాయ‌నేది బీజేపీనేత‌ల మాట‌గా ఉంది. కానీ, ఇప్పుడు ప‌రిణామాలు మారుతున్నాయి. జ‌న‌సేనాని.. టీడీపీని క‌లుపుకొని ముందుకు సాగాల‌ని అంటు న్నారు. ఈ క్ర‌మంలో బీజేపీ మప‌రిస్థితుల‌కు అనుగుణంగా ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతోంది.

ఈ నేప‌థ్యంలో ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారో.. ఏమో.. బీజేపీ నాయ‌కులు కూడా స్వ‌రం మారుస్తున్నారు. మునుప‌టి మాదిరిగా.. టీడీపీని టార్గెట్ చేయ‌డం త‌గ్గించారు. పైగా.. టీడీపీతో పొత్తు ఉండ‌ద‌ని.. గ‌తంల చెప్పిన బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆ మాట మ‌రిచిపోయారు. తాజాగా వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందని తామెక్కడా చెప్పలేదన్నారు. ఇది కేవలం మీడియా అనుకుంటోం దంటూ సోము వ్యాఖ్యానించారు. అయితే ఈ సందర్భంగా ఆయన టీడీపీతో పొత్తు ఉండదు అని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. గతంలో ఎప్పుడూ ఆయన ఈ విషయం గురించి ప్రస్తావిస్తే.. టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని విరుచుకుపడే వారు.. కానీ ఇప్పుడు మాత్రం ఆ స్థాయిలో రియాక్ట్ అవ్వలేదు..పొత్తు ఉండదని కనీసం ఖండించ లేదు.

అంటే.. పవన్ కోరినట్లుగానే బీజేపీ రోడ్ మ్యాప్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇచ్చినట్టు అయ్యింది. ఇటీవల బీజేపీ ఎంపీ జీవీఎల్ కూడా దాదాపు ఇదే అర్థం వచ్చేలా మాట్లాడారు. ప్రస్తుతం బీజేపీ నేతలు ఎవరూ టీడీపీతో పొత్తు ఉండదు అనని చెప్పడం లేదు.. అంతే కాదు.. అందరూ తమ లక్ష్యం సీఎం జగన్ ను గద్దె దింపడమే అంటున్నారు. గ‌తంలో చంద్ర‌బాబును, ఆయ‌న పాల‌న‌ను విమ‌ర్శించిన వారు సైతం ఇప్పుడు సైలెంట్ అయ్యారు. సో.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. పాత మిత్రుల మ‌ధ్య కొత్త పొత్తుల‌కు అవ‌కాశం ఏర్ప‌డుతోంద‌న‌ని తెలుస్తోంది. మ‌రి ఏపీలో ప‌రిణామాలు ఎలా మార‌తాయో చూడాలి.