Begin typing your search above and press return to search.
జనసేనతో పొత్తుండాలి
By: Tupaki Desk | 21 March 2022 7:34 AM GMTరాబోయే ఎన్నికల్లో జనసేనతో పొత్తుంటే తమకు 160 సీట్లు ఖాయమని టీడీపీ ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడు చెప్పారు. ఒకవేళ జనసేనతో పొత్తులేకపోయినా 110 సీట్లయితే ఖాయమట. మంచిది అధికారంలోకి రావాలని అనుకునే ఏ పార్టీకైనా ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. అయితే 160 సీట్లు తెచ్చుకోవటానికైనా లేదా ఒంటరిగా పోటీచేసి 110 సీట్లు గెలుచుకోవటానికైనా టీడీపీ చేస్తున్న పోరాటాలు ఏమిటి అనేది విచిత్రంగా ఉంది.
టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావటం ఖాయమని చంద్రబాబునాయుడు దగ్గర నుండి కిందిస్ధాయి వరకు అందరు చెప్పుకుంటున్నారు. అయితే దానికి ప్రాతిపదిక ఏమిటి అనేది మాత్రం అర్ధం కావటంలేదు. వీళ్ళంతా చెప్పేదేమంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపైన జనాల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందట. జనాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు ? దానికి ఆధారాలేమీ లేవు వీళ్ళదగ్గర. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులే వీళ్ళకు ఆధారం.
ఇదే విషయమై వైసీపీ నేతలు మాట్లాడుతు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో టీడీపీనే వేలాదిమందిని ఎంగేజ్ చేసుకుని దుష్ప్రచారం చేయిస్తోందంటున్నారు. నిజానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ, టీడీపీకి వ్యతిరేకంగా అధికారపార్టీ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని బురద చల్లుకోవటం చాలా సహజం. ఇంతమాత్రాన జనాల్లో వ్యతిరేకత వచ్చేసిందని నమ్మితే అంతే సంగతులు. ఏదైనా ఎన్నికలు జరిగినపుడు అధికారపార్టీ ఓడిపోతే ప్రభుత్వం మీద జనాల్లో వ్యతిరేకత ఉందనేందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
తెలంగాణాలో దుబ్బాక, గ్రేటర్ మున్సిపాలిటి ఫలితాలు, హుజూరాబాద్ ఉపఎన్నికల ఫలితాలే ఇందుకు ఉదాహరణలు. కానీ ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు, ఉపఎన్నికల్లో వైసీపీయే ఘన విజయం సాధించింది. కాబట్టి రేపు ఎక్కడైనా ఉపఎన్నికలో లేదా పెండింగ్ లో ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో వస్తేకానీ ఏ సంగతి తేలదు. ఇప్పటికైతే టీడీపీ అచ్చంగా జగన్ వ్యతిరేక మీడియాను, సోషల్ మీడియాను మాత్రమే నమ్ముకుంది. ఒకసారి ఈ రెండింటిని నమ్ముకుని ముణిగిపోయిం. వీటిని నమ్మకోకుండా జనాలను నమ్మకుంటే టీడీపీకి గెలిచే అవకాశముంది.