Begin typing your search above and press return to search.

కేసీఆర్‌కు ఉగాది ప‌రీక్ష‌!

By:  Tupaki Desk   |   26 March 2022 9:18 AM GMT
కేసీఆర్‌కు ఉగాది ప‌రీక్ష‌!
X
కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై స‌మ‌ర శంఖం పూరించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉగాది రూపంలో మ‌రో ప‌రీక్ష ఎదుర‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సైతో దూరంగా ఉంటూ వ‌స్తున్న కేసీఆర్ ఆ ప‌ర్వ‌దినాన రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్తారా? లేదా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. వ‌చ్చే నెల రెండో తేదీన ఉగాది పండ‌గ ఉంది. ఈ నేప‌థ్యంలో రాజ్‌భ‌వ‌న్‌లో ఉగాది వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌ని, సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికార‌, విప‌క్ష పార్టీ నేత‌లు, ఇత‌ర ప్ర‌ముఖుల‌ను ఆహ్వానిస్తున్నాన‌ని గ‌వ‌ర్న‌ర్ చెబుతున్నారు.

మ‌రి ఆ ఆహ్వానాన్ని మ‌న్నించి కేసీఆర్ రాజ్‌భ‌వ‌న్ వెళ్లారా? లేదా ఎప్ప‌టిలాగే మ‌రోసారి కేంద్రంపై త‌న ఆగ్ర‌హాన్ని వెళ్ల‌గ‌క్కేందుకు ఈ సంద‌ర్భాన్ని వాడుకుని దూరంగా ఉంటారా? అన్న‌ది చూడాలి.

ఇటీవ‌ల కేసీఆర్‌, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య దూరం పెరిగింద‌నే సంగ‌తి తెలిసిందే. కౌశిక్‌రెడ్డిని గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా చేయాల‌ని ప్ర‌భుత్వం పంపిన ప్ర‌తిపాద‌న‌ను త‌మిళిసై తిర‌స్క‌రించ‌డంతో ఇదంతా మొద‌లైంది.

ఆ త‌ర్వాత రిప‌బ్లిక్ డే వేడుక‌ల‌కు రాజ్‌భ‌వ‌న్‌కు కేసీఆర్ వెళ్ల‌క‌పోవ‌డం.. గ‌వ‌ర్న‌ర్ మేడారం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌భుత్వ అధికారులు అక్క‌డ లేక‌పోవ‌డం.. ఇలా వివాదం సాగుతూనే ఉంది.

తాజాగా బ‌డ్జెట్ స‌మావేశాల‌కు ముందు త‌న ప్ర‌సంగం లేక‌పోవ‌డంపై గ‌వ‌ర్న‌ర్ అసంతృప్తి వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.మ‌రోవైపు కేసీఆర్‌తో త‌న‌కు విభేదాలున్నాయ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో త‌మిళి సై ప్ర‌క‌టించార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ ప‌రిస్థితుల్లో ఉగాదిని ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా కేసీఆర్‌కు మ‌రో ప‌రీక్ష పెట్టేందుకు గ‌వ‌ర్న‌ర్ సిద్ధ‌మ‌య్యార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. రాజ్‌భ‌వ‌న్‌లో వేడుక‌లకు సీఎం కేసీఆర్‌తో స‌హా అంద‌రినీ ఆహ్వానిస్తున్నాన‌ని గ‌వ‌ర్న‌ర్ ప్ర‌క‌టించారు. అది త‌న మ‌ర్యాద అని, వాళ్లు నా ఆహ్వానాన్ని స్నేహ‌పూర్వ‌కంగా స్వీక‌రిస్తార‌ని భావిస్తున్న‌ట్లు ఆమె చెప్పారు. తెలుగు కొత్త సంవ‌త్సరం సంద‌ర్భంగా పాత విషయాల‌ను మ‌రిచి కొత్త ఆరంభాన్ని కోరుకుందామ‌ని ఆమె పేర్కొన‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

అయితే ఆమె ఆహ్వానం వెన‌క రాజ‌కీయ కోణం కూడా ఉంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. గ‌వ‌ర్న‌ర్ పిలిచినా కేసీఆర్ రాలేద‌ని, ఇదే ఆయ‌న సంస్కార‌మ‌ని ప్ర‌జ‌ల ముందు నిల‌బెట్టేందుకు ఇలా చేసి ఉండొచ్చ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఒకవేళ కేసీఆర్ వెళ్ల‌క‌పోతే విమ‌ర్శ‌లు ఇంకా ఎక్కువ‌వుతాయి. ఒక‌వేళ వెళ్తే మాత్రం గ‌వ‌ర్న‌ర్‌తో విభేదాల‌కు ఫుల్‌స్టాప్ పెట్టిన‌ట్లు అవుతుంది. మ‌రి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.