Begin typing your search above and press return to search.

కేసీఆర్ కూడా దుకాణం పెట్టాడా?

By:  Tupaki Desk   |   31 March 2022 10:33 AM GMT
కేసీఆర్ కూడా దుకాణం పెట్టాడా?
X
ఏపీ సీఎం జగన్ బాటలో కేసీఆర్ నడుస్తున్నారు. తెలంగాణ కేబినెట్ ను కూడా పునర్వ్యస్థీకరించడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే కేబినెట్ లో కొత్తవారికి చోటు కల్పించాల్సి ఉండగా.. అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. శాసనసభ సమావేశాలు, యాదాద్రి దేవాలయం ప్రారంభోత్సవాలు వంటి కార్యక్రమాలు పూర్తైనందు వల్ల ఉగాది తర్వాత అంటే ఏప్రిల్ మొదటి వారంలోనో లేదా రెండో వారంలోనో తెలంగాణ మంత్రివర్గంలో మార్పులకు సీఎం చంద్రశేఖర్ రావు డిసైడ్ అయినట్టు సమాచారం.

ఇప్పుడున్న తెలంగాణ మంత్రివర్గంలో ఐదుగురికి ఉద్వాసన పలికి ఆ స్థానాల్లో ఐదుగురు కొత్త ఎమ్మెల్యేలకు మంత్రులుగా కేసీఆర్ అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఎప్పుడూ ఏది చెప్పి చేయరు. సడెన్ గా నిర్ణయాలు తీసుకొని షాకిస్తారు. ఆయన అనుకున్నప్పుడే భారీ మార్పులు చేస్తారు. తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ కూడా అదే విధంగా జరుగబోతోంది. తెలంగాణ కేబినెట్ కూర్పు ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉండగా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఆశావహులు మాత్రం తెలంగాణ భవన్, ప్రగతి భివన్ చుట్టూ ప్రదక్షిణలు కొనసాగిస్తున్నారు.

తెలంగాణ కేబినెట్ విస్తరణకు కేసీఆర్ ముహూర్తం పెట్టినట్టు తెలిసింది. ఉగాది తర్వాత కుదిరితే ఏప్రిల్ రెండో వారంలో క్యాబినేట్ కూర్పును చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇఫ్పుడున్న మంత్రుల్లో ఐదుగురికి ఉద్వాసన పలికే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొంతమంది మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాల్సి ఉందని.. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించడంలో విఫలం అవుతున్నారని కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కేసీఆర్ హెచ్చరికలను మంత్రులు పెడచెవిన పెట్టినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే వారికి ఉద్వాసన తప్పదన్న చర్చ సాగుతోంది.

ఈసారి ఉత్తర తెలంగాణ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు, దక్షిణ తెలంగాణ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చాన్స్ దక్కవచ్చని అంటున్నారు. ఉద్వాసన పలికే మంత్రుల స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను తిరిగి మంత్రులుగా తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

సామాజిక సమీకరణాలు దెబ్బతినకుండా ఈసారి ప్రతి వర్గానికి గుర్తింపు నిచ్చేలా కేబినెట్ ఉంటుందని.. ఈసారి మంత్రివర్గంలో మహిళళకు కూడా ప్రాధాన్యత ఉంటుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.

ఇక ఈసారి దక్షిణ తెలంగాణ నుంచి ఇద్దరు కొత్త అభ్యర్థులతోపాటు ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు కొత్త అభ్యర్థులు మంత్రివర్గంలోకి కొత్తగా రానున్నారు. వీరితోపాటు ఎమ్మెల్సీ కవితకు కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

జోగురామన్న, దానం నాగేందర్ లకు మంత్రివర్గంలో అవకాశం కల్పించొచ్చనే చర్చ జోరుగా వినిపిస్తోంది. ఐతే మంత్రివర్గ విస్తరణ రాబోయే సార్వత్రి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తారని అంటున్నారు.

మొత్తంగా జగన్ లాగానే కేసీఆర్ సైతం కొత్త కేబినెట్ లో మార్పులు చేసి ఆ దిశగా ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోం