Begin typing your search above and press return to search.
పాక్ ఉగ్రవాదులకు బెజవాడ నుంచి నిధులు? షాకింగ్ నిజాన్ని చెప్పిన చార్జిషీట్!
By: Tupaki Desk | 16 March 2022 11:07 AM GMTకొన్ని నెలల క్రితం విజయవాడకు చెందిన మాచవరం సుధాకర్.. ఆయన సతీమణి దుర్గా పూర్ణిమా వైశాలితో పాటు మరో పద్నాలుగు మందిని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అరెస్టు చేయటం సంచలనమైంది. ఆఫ్ఘానిస్తాన్ నుంచి దేశానికి హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాల్ని తీసుకురావటం.. దాన్ని అనేక రాష్ట్రాల్లో అమ్మి.. ఆ నిధులను పాక్ లోని ఉగ్రవాదులకు అందచేస్తున్న వైనానికి సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.
గతంలో గుజరాత్ లోని ముంద్రా పోర్టులో సెమీ ప్రాసెస్డ్ టాల్కం స్టోన్స్ రూపంలో పట్టుబడిన హెరాయిన్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. కారణం.. అప్పట్లో పట్టుబడిన ఆ హెరాయిన్ ఏకంగా మూడు వేల కేజీలు కాగా.. దాని విలువ ఏకంగా రూ.24వేల కోట్లు కావటమే. ఈ భారీ హెరాయిన్ ను అఫ్గాన్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా దిగుమతి చేసుకొని.. దాన్ని దొంగ మార్గంలో అమ్మటం.. అనంతరం ఆ డబ్బును పాక్ కు పంపటం లాంటివి జోరుగా సాగుతున్నాయి.
ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్ వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. విజయవాడ సత్యనారాయణపురంలోని ఆషీ ట్రేడర్స్ పేరుతో జరిగిన ఈ దందాకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు వివరాలన్ని సేకరించారు. ఇందులో ఉగ్రవాదులతో సుధాకర్ తో పాటు ఆయన సతీమణికి సంబంధాలు ఉన్నాయని తేల్చారు. వీరే కాక మరికొందరు కూడా ఉన్న విషయం తెలిసిందే. చార్జిషీట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం సుధాకర్ దంపతులు దేశ ద్రోహానికి పాల్పడినట్లుగా పేర్కొన్నారు.
అఫ్గాన్ నుంచి వచ్చే ఈ డ్రగ్స్ ను దేశంలోని పంజాబ్.. ఢిల్లీ.. బెంగళూరు.. గుజరాత్ తదితర రాష్ట్రాల్లో అమ్మకాలు గుర్తించారు. ఎక్కడ అఫ్గానిస్థాన్.. మరెక్కడి విజయవాడ.. ఇంకెక్కడి పాకిస్థాన్? ఇలా సంబంధం లేని లింకులు కలవటం.. వాటి ద్వారా కలలో కూడా ఊహించనంత పకడ్భందీగా డ్రగ్స్ వ్యాపారం జరపటం.. ఆ నిధుల్ని దేశాన్ని దాటించి ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్న వైనం వినేందుకే షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు.