Begin typing your search above and press return to search.

టెక్సాస్ కాల్పుల ఘటన: స్పందించిన షూటర్ తల్లి

By:  Tupaki Desk   |   29 May 2022 8:30 AM GMT
టెక్సాస్ కాల్పుల ఘటన: స్పందించిన షూటర్ తల్లి
X
ఎంతైనా తల్లి మనసు కదా.. కొడుకు కిరాతకుడు అయినా అతడిపై ప్రేమ మాత్రం తగ్గలేదు. కొడుకు మీద ప్రేమను కనబరుస్తూ క్షమించమని వేడుకుంది. 18 ఏళ్ల టెక్సాస్ షూటర్ రామోస్ తాజాగా స్కూల్లోకి ప్రవేశించి 19మంది అమాయకపు చిన్నారులను హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన కుమారుడిని హంతకుడు, సైకో అంటూ రకరకాలుగా అంటుంటే ఆ తల్లి మనసు తల్లడిల్లింది. తన కొడుకు చెడ్డవాడైనా.. కన్నకొడుకే కదా అని కన్నీరుమున్నీరైంది. కొడుకు చేసిన పని తప్పు అని అంటూనే.. అతడిని మాత్రం నిందించవద్దని వేడుకుంటోంది. రామోస్ ఇలా కాల్పులు జరపడానికి కారణాలున్నాయని తల్లి అడ్రినా మార్టినెజ్ తెలిపింది.

టెక్సాస్‌లోని ఉవాల్డే పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. రోబ్ ఎలిమెంటరీ పాఠశాలలో 18 ఏళ్ల సాల్వడార్ రామోస్ కాల్పులు జరపడంతో శుక్రవారం 19 మంది పిల్లలు మరియు ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు.

తన కొడుకు రాక్షసుడు కాదని గతంలో చెప్పిన షూటర్ సాల్వడార్ రామోస్ తల్లి ఇప్పుడు అందరినీ క్షమించమని కోరింది. అడ్రియానా మార్టినెజ్ తాజాగా కాల్పుల ఘటనపై విచారం వ్యక్తం చేసింది. నా కొడుకు ఎందుకు ఇలా కాల్పులు జరిపాడో తనకు తెలియదని చెప్పింది. దీనికి అతడి స్వంత 'కారణాలు' కారణం కావచ్చని ఆమె చెప్పింది. కాల్పులకు తెగబడ్డ నా కొడుకు అసలు ఏమి ఆలోచిస్తున్నాడో నాకు తెలియదు" అని ఆమె వివరించింది.

అడ్రియానా మార్టినెజ్ మాట్లాడుతూ 'నా కొడుకు చేసిన పనికి అతని కారణాలు ఉన్నాయి. దయచేసి అతనిని కాల్చిచంపొద్దు. మరణించిన అమాయక పిల్లలు ఘటన బాధాకరం.. నన్ను క్షమించాలని మాత్రమే కోరుకుంటున్నాను’ అని ఆమె చెప్పింది. ‘నన్ను క్షమించు, నా కొడుకును క్షమించు. ఇలా కాల్పులు జరపడానికి తన కొడుక్కి కారణాలు ఉన్నాయని నాకు తెలుసు.’ మార్టినెజ్ తెలిపింది. రామోస్ ‘హింసాత్మక వ్యక్తి కాదు’ అని ఆమె వివరించింది. అయితే కోపంగా ఉన్నప్పుడు ‘దూకుడు’గా ఇలా ఏదో ఒకటి చేస్తాడని తెలిపింది.

సాల్వడార్ రామోస్ ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో 21 మందిని కాల్చి చంపాడు. స్కూల్లో కాల్పులు జరపడానికి ముందు రామోస్ ఇంట్లో అతడి అమ్మమ్మను తుపాకీతో కాల్చాడు. అతడి అమ్మమ్మతో సహా 17 మందికి పైగా గాయాలయ్యాయి.

అదే పేరుతో ఉన్న రామోస్ తండ్రి, తన కొడుకు ఎందుకు ఇలా చేశాడో తెలియదని.. క్షమించండి అని వేడుకున్నాడు. ‘అతను ఎవరినైనా ఇలాంటి పని చేసే బదులు నన్ను చంపి ఉండాల్సింది’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.