Begin typing your search above and press return to search.

#RussiaUkrainewar: ఆ రెండింటి పైనే భయం భ‌యం

By:  Tupaki Desk   |   24 Feb 2022 3:30 PM GMT
#RussiaUkrainewar: ఆ రెండింటి పైనే భయం భ‌యం
X
బ‌డ్జెట్ లో రెండు రెండు ఉప‌శ‌మ‌నాలు మొన్న‌టి వేళ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు.కానీ ర‌ష్యా,ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం కార‌ణంగా ఆ రెండూ కూడా మ‌న‌కు ద‌క్క‌కుండా పోనున్నాయి.ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో ...

బంగారం ధ‌ర మ‌ళ్లీ పెర‌గ‌నుంది అన్న వార్త ఒక‌టి ర‌ష్యా - ఉక్రెయిన్ నేప‌థ్యంలో వినిపిస్తోంది. అదేవిధంగా పెట్రో ఉత్ప‌త్తుల ధ‌ర కూడా బాగానే పెరిగేందుకు అవ‌కాశాలు ఉన్నాయ‌న్న వార్త కూడా వినిపిస్తోంది.

ఈ రెండూ ఇప్పుడు భార‌త్ లో ప్ర‌ధాన భ‌యాలు.ఎందుకంటే ఇప్ప‌టికే బ‌డ్జెట్ నేప‌థ్యంలో పెట్రో ఉత్ప‌త్తుల ధ‌ర‌లు మ‌రీ పెర‌గకపోయినా ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ అయితే ఉంది. ఆ విధంగా కొంత వ‌ర‌కూ వినియోగ‌దారుడికి సేఫ్. కానీ యుద్ధం ప్ర‌భావం కార‌ణంగా ఒక్క‌సారిగా చ‌మ‌రు ధ‌ర‌లు పెరిగేందుకు ఉన్న అవ‌కాశాలూ కొట్టిపారేయ‌లేం. ఆవిధంగా చూసుకుంటే మ‌ళ్లీ చ‌మ‌రుధ‌ర‌లు దేశీయంగా చుక్క‌లు చూపించేందుకు సిద్ధం అవుతున్నాయి.

ఒక‌వేళ పెట్రో ఉత్ప‌త్తి ధ‌ర‌లు గ‌రిష్ట స్థాయికి చేరుకుంటే మ‌న ప్ర‌భుత్వాలు చేప‌ట్టే నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై కూడా ఇప్ప‌టి నుంచే అనుమానాలు వ‌స్తున్నాయి. ఎందుకంటే క‌రోనా త‌రువాత ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు సంబంధించి కేంద్రం తీసుకున్న చ‌ర్య‌లేవీ లేవు. కొంత‌లో కొంత పెట్రో ఉత్ప‌త్తుల‌పై ధ‌ర‌లు త‌గ్గించి ఇటీవ‌ల కాలాన ఉప‌శ‌మ‌నం ఇచ్చినా కూడా ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌రువాత అవి కూడా మ‌ళ్లీ పెంచేందుకు ఉన్న అవ‌కాశాలు కొట్టిపారేయలేం. ఈ ద‌శ‌లో ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్యయుద్ధం మొద‌ల‌యింది క‌నుక ఇదే సాకుతో చ‌మురు ధ‌ర‌లు పెరిగితే ఇక మ‌న‌కు క‌ష్టాలు త‌ప్ప‌వు. ఇదే స‌మ‌యంలో బంగారం ధ‌ర‌లు కూడా పెరిగేందుకు అవ‌కాశం ఉన్నాయి.

యుద్ధం నేప‌థ్యంలో బంగారం ధ‌ర ఒక్క‌సారిగా పెరిగిపోయింద‌ని, ఇప్పుడున్న ధ‌ర ప్ర‌కారం 10 గ్రాముల ధ‌ర 51,750 రూపాయ‌లుగా ఉంది..అని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అది కూడా ఇంకా పెరిగే అవ‌కాశం ఉంది.

ఇక లీట‌రు పెట్రోల్ ధ‌ర హైద్రాబాద్‌లో రూ. 108.20 ఉండగా, ఇది మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం స్థానిక ప‌న్నులు కూడా కలుపుకుని ఈ ధర ఉంది కానీ కొన్ని చోట్ల రాష్ట్రాల ప‌న్నుల మిన‌హాయింపులు ఉన్నాయి.ఒక‌వేళ అంత‌ర్జాతీయ మార్కెట్లో ధ‌ర‌లు పెరిగితే రాష్ట్రాలు ప‌న్ను మిన‌హాయింపుల‌ను ర‌ద్దు చేసే అవ‌కాశాల‌నూ కొట్టి పారేయ‌లేం.