Begin typing your search above and press return to search.

వ్యూహం మార్చిన రష్యా.. వాటికి చిక్కకుండా వ్యూహాలు

By:  Tupaki Desk   |   16 March 2022 4:44 AM GMT
వ్యూహం మార్చిన రష్యా.. వాటికి చిక్కకుండా వ్యూహాలు
X
రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం రోజు రోజుకు తీవ్ర తరం అవుతుంది. వందల మంది ప్రాణాలు నిత్యం గాలిలో కలిసిపోతున్నాయి. కానీ దాడులు మాత్రం ఆగడం లేదు. ఏ వైపు నుంచి ఏ బాంబు పేలుడు సంభవిస్తుందో అని నిరంతరం భయపడుతున్నారు. రష్యా యుద్ధ రంగంలో మాత్రం మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. అలా అని ఉక్రెయిన్ నత్త నడకన యుద్ధం సాగిస్తుంది అని కాదు. రష్యా కు అదే స్థాయిలో ధీటైన రీతిలో సమాధానం చెప్తుంది ఉక్రెయిన్. వార్ ప్రారంభం అయిన రోజు కేవలం రెండు రోజుల్లో రష్యా ఉక్రెయిన్ ను ఆక్రమిస్తుందని అనుకున్నారు కానీ అందరి అంచనాలకు భిన్నంగా వ్యవహరించింది ఉక్రెయిన్.

సరికొత్త యుద్ధ వ్యూహాలతో అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్న రష్యా కు చుక్కలు చూపిస్తుంది. పశ్చిమ దేశాల నుంచి వస్తున్న యుద్ధ సామాగ్రి ని సరైన రీతిలో వినియోగించుకుంటుంది. దీంతో రష్యా చేస్తున్న దాడులకు చెక్ చెప్తుంది. కొన్ని ప్రాంతాల్లో వెనుకంజ వేసిన గానీ ప్రధాన నగరాల్లో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అయితే ఉక్రెయిన్ దగ్గర ఉన్న ఆయుధ వ్యవస్థ కంటే రష్యా దగ్గర ఉండే ఆయుధ వ్యవస్థ చాలా పటిష్టమైంది. అయినా కానీ ఒకటి తరువాత ఒక దానిని మట్టుపెడతూనే ఉంది ఉక్రెయిన్.

ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థలో ఉన్న వాటికి చిక్కకుండా రష్యా కొత్త వ్యూహం అమలు చేస్తుంది. అదే ఇస్కాందర్ ఎం అనే క్షిపణులు ద్వారా చాలా రహస్యమైన పరికరాలను ప్రయోగిస్తుంది రష్యా. ఈ క్షిపణి ప్రయోగం చేయడం ద్వారా ఉక్రెయిన్ యాంటి మిసైల్ వ్యవస్థలు కూడా వాటిని కనిపెట్ట లేకపోతున్నాయి. మారిన యుద్ధ విధానంలో భాగంగా రష్యా ఇలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ కొత్త యుద్ధ తంత్రం వల్ల ఉక్రెయిన్ క్షిపణి వ్యవస్థ వాటిని రాకను కనిపెట్టలేక పోతున్నాయి. అంతే గాకుండా వాటిని తప్పు దోవ పట్టిస్తున్నాయి అని చెప్తున్నారు.

రష్యా... ఉక్రెయిన్ రాడార్లను తప్పు దోవ పట్టించే వాటిని ప్రస్తుతం ఎక్కువగా ప్రయోగిస్తుంది. అయితే దీని పొడవు, ఆకారం చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇలా పరిమాణం చాలా తక్కువగా ఉండటం వల్ల ఇవీ ఉక్రెయిన్ రాడార్ల కళ్లు కప్పి శత్రు దేశం వైపు దూసుకుపోతున్నాయి. వీటిని మొబైల్ లాంచర్ల సాయంతో రష్యా ప్రయోగిస్తుంది.

ఇస్కాండర్ ఎమ్ లో ఉండే చిన్న బాలిస్టిక్ క్షిపణి ద్వారా వీటిని ప్రయోగిస్తే అది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కు కూడా దొరకకుండా ఉంటుంది. సాధారణంగా అయితే మిసైల్స్ ప్రయోగం అంటే కచ్చితంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కచ్చితంగా కనిపెట్టేస్తుంది. కానీ రష్యా ఇలా ప్రయోగాలు చేయడం ద్వారా అవి కనిపెట్టలేక పోతున్నాయి. ఇది ప్రస్తుతం ఉక్రెయిన్ సైన్యానికి పెద్ద సవాలుగా మారింది.

ఇస్కాందర్ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి చిన్న శ్రేణిలో ఉండే బాలిస్టిక్ మిసైల్సు అని చెప్పుకోవచ్చు. దీనిలో ఘన ఇంధన రాకెట్ ఉంటుంది. దీని ద్వారా చాలా ఎక్కువ దూరం క్షిపణి ప్రయాణం చేయగలదు. ఈ క్షిపణి 200 మైళ్ళ దూరంలో ఉన్న టార్గెట్ లను కూడా ఛేదించగలదు. దీన్ని సులభంగా ప్రయోగించేందుకు మొబైల్ లాంచర్ సరిపోతుంది. దీని ద్వారా పెద్ద కష్టం లేకుండా ప్రయోగం చేపట్టవచ్చు.