Begin typing your search above and press return to search.
ప్రమాదంలో మోడీ ? ప్రాంక్ మెయిల్ తో ఉలిక్కి పడ్డ ఎన్ఐఏ !
By: Tupaki Desk | 1 April 2022 5:51 PM GMTఆర్థిక రాజధాని ముంబయిలో అలజడులు రేగాయి. ప్రధాని మోడీని చంపేస్తామంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి చేసిన అత్యున్నత భద్రతా వ్యవస్థ కు మెయిల్ ఓ ప్రకంపనానికి కారణం అయింది. భద్రతా అధికారుల అప్రమత్తం అయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను నిర్థారించడంలో తలమునకలయి ఉన్నారు. ఒక్క ప్రధానికే కాకుండా తన లక్ష్యం ఏకంగా ఇరవై లక్షల మంది ప్రజల ప్రాణాలను హరించడమే అని ఎన్ఐఏకు చేసిన మెయిల్ లో పేర్కొనడంతో అనుమానిత ప్రాంతాల్లో అధికారుల సోదాలు మొదలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ని చంపేస్తానంటూ ఓ అగంతకుడు ముంబయి కేంద్రంగా పనిచేసే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కు ఓ మెయిల్ పంపాడు.తన వద్ద 20 కిలోల ఆర్డీఎక్స్ ఉందని, దేశ వ్యాప్తంగా ఇరవై చోట్ల పేలుళ్లకు ప్రణాళిక సిద్ధం చేశానని పేర్కొన్నాడు.
ప్రధాని మోడీ తన జీవితాన్ని నాశనం చేశారని అందుకే తాను ఈ ప్రతికారం తీర్చుకోవాలని భావిస్తున్నానని అన్నాడు. తన లక్ష్యంలో ఇరవై మిలియన్ ప్రజలను చంపడమే అని ఇందుకు వేర్వేరు చోట్ల పేలుళ్లకు సిద్ధం అయి ఉన్నానని కూడా అందులో రాసుకు వచ్చాడు. దీంతో ఎన్ ఐ ఏ అప్రమత్తమయింది.
ఎవరో ఇన్స్టెంట్ ఎటెన్షన్ కోసం ఈ తరహా ప్రాంక్ మెయిల్ పంపి ఉంటారని భద్రతాధికారులు భావిస్తున్నారు. అయినా సరే ఈ విషయాన్ని అంత సులువుగా వదిలేది లేదని మెయిల్ వచ్చిన ఐపీ అడ్రస్ ను తాము ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దేశ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన భద్రత సంబంధిత కారణాల దృష్ట్యా తాము ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలిస్తున్నామని,దీనికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎన్ఐఏ అధికారులు అన్నారు.