Begin typing your search above and press return to search.
భార్య కాపురానికి రావట్లేదని సెల్ టవర్ ఎక్కాడు.. దిగుతుండగా దారుణం
By: Tupaki Desk | 24 Feb 2022 4:30 AM GMTదురదృష్ట ఘటన ఒకటి జడ్చర్లలో చోటు చేసుకున్నది. అయ్యో.. అనిపించే ఈ ఉదంతం అనూహ్యంగా ఉండటమే కాదు.. ఇలా చేయటం ఏమిటి? అన్న సందేహం కలుగక మానదు.
మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లకు చెందిన యువకుడు ఒకడు తన భార్య కాపురానికి రావట్లేదని సెల్ టవర్ ఎక్కాడు. దిగే వేళలో జారి పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
భార్య కాపురానికి రావట్లేదన్న మనస్తాపంతో సెల్ టవర్ ఎక్కాడు యాదయ్య అనే వ్యక్తి. జడ్చర్ల రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకున్న ఈ వైనం స్థానికంగా సంచలనంగా మారింది.
పెద్ద ఎత్తున ప్రజలు అక్కడకు చేరుకున్నారు. తన భార్యను కాపురానికి రప్పించాలంటూ డిమాండ్ చేశాడు. ఈ ఉదంతం గురించి వివరాలు అందుకున్న పోలీసులు సెల్ టవర్ వద్దకు చేరుకున్నారు.
ముందుజాగ్రత్త చర్యగా అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించారు. వారు యాదయ్యకు నచ్చజెప్పారు. అతన్ని కిందకు దిగేందుకు ఒప్పించారు.
ఈ క్రమంలో సెల్ టవర్ మీద నుంచి కిందకు దిగుతున్న క్రమంలో.. పట్టుతప్పి జారి కింద పడ్డాడు. ప్రాణాల్ని కోల్పోయాడు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. భార్య కాపురానికి రావాలన్న అతడి కోరిక తీరకుండా ప్రాణాల్ని విడిచేశాడు.