Begin typing your search above and press return to search.
ఆరు నెలల్లోనే అంత వ్యతిరేకతా...?
By: Tupaki Desk | 19 March 2022 1:30 PM GMTఏపీలో వైసీపీ సర్కార్ ఎన్నో ఘన విజయాలను నమోదు చేసింది. గట్టిగా చెప్పాలీ అంటే విపక్షాలు నోరెత్తేందుకు కూడా వీలు లేని విధంగా వరస పరాజయాలు వారిని పలకరించాయి. ఎన్నిక లోకల్ అయినా లోక్ సభ అయినా సరే మాదే విజయం అని తొడగొట్టి మరీ సత్తా చాటింది వైసీపీ. నిజంగా వైసీపీ నూటికి ఎనభై తొంబై శాతం సీట్లను అన్ని చోట్లా సంపాదించుకుంది.
ఇలాంటి అపూర్వ విజయాలను చూసినపుడు మరిన్ని టెర్ములు ఆ పార్టీయే అధికారంలో ఉంటుందని ఎవరైనా అనుకోవడం సహజం. కానీ వైసీపీకి 2021లో తొలి అర్ధభాగం బాగా కలసి వచ్చింది కానీ బద్వేల్ ఉప ఎన్నిక తరువాత నుంచే సీన్ మారింది అంటున్నారు.
బహుశా అదే ఏపీలోని ప్రతిపక్షాలకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చాయని కూడా విశ్లేషిస్తున్నారు. మరి ఈ ఆరు నెలల్లో జరిగిన పరిణామాలు ఏంటి, ఎందుకు వైసీపీ ఊపు ఇంతలా తగ్గిపోయింది అని ఆలోచిస్తే చాలానే జరిగాయి అని చెప్పాలి. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు అతి బలమైన వర్గం. వారు పదమూడు లక్షల మంది దాకా ఉంటారు.
వారి విషయంలో ప్రభుత్వం అనుసరించిన విధానంతో పీయార్సీ పితలాటం కూడా వైసీపీకి చెడ్డ పేరు తెచ్చింది అంటున్నారు. తెగేదాకా లాగడం అన్న దాన్ని వైసీపీ మొండిగా అమలు చేయడం వల్ల ఉద్యోగులు ఫిబ్రవరిలో విజయవాడలో నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది.
అదే అధికార పార్టీ బలహీనతలను బయటపెట్టేసింది అంటున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున నిరసనను చూసి ఎరగదు అంతే కాదు, రాజధాని నడిబొడ్డున లక్షలాది మంది ఉద్యోగులు నిర్వహించిన ర్యాలీ కొత్త చరిత్రనే సృష్టించింది.
దాంతో ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరిపి పీయార్సీ వివాదాన్ని పరిష్కరించుకున్నా ఆ అసంతృప్తి ఇకా వారిలో ఉందనే అంటున్నారు. మరో వైపు వైసీపీ మీద అంతర్లీనంగా ఉన్న అసంతృప్తి అలా బాహాటం అయింది అని కూదా అంటున్నారు.
దానిని చూసిన మీదటనే వైసీపీ విషయంలో గట్టిగా ఢీ కొట్టేందుకు విపక్షాలకు కొండంత ధైర్యం వచ్చిదని చెప్పాలి. ఉద్యోగ వర్గాలు ఏ వైపు ఉంటే వారిదే విజయం. ఆ సెంటిమెంట్ ఏపీలో ఎపుడూ వర్కౌట్ అవుతూ వస్తోంది. ఇపుడు లక్షలాది మంది ఉద్యోగులు వైసీపీ మీద బాహాటంగా తెలియచేసిన నిరసన అపోజిషన్ కి టానిక్ లా పనిచేసింది అని అంటున్నారు.
ఇంకోవైపు చూసుకుంటే అమరావతి రాజధాని విషయంలో హై కోర్టు ఇచ్చిన తుది తీర్పు కూడా వైసీపీ మీద జరిపిన అతి పెద్ద ప్రజా ఉద్యమానికి ఘన విజయంగా భావిస్తునారు. ఇది ఒక విధంగా చెప్పాలీ అంటే వైసీపీకి నైతికంగా ఓటమిగా కూడా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి.
ఇవన్నీ పక్కన పెడితే గడచిన ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల కాలంలో ధరల పెరుగుదల, కరోనా మూడు దశల నుంచి మెల్లగా పాకిన వ్యతిరేక ప్రభావం వంటివి కూడా యాంటీ ఇంకెంబెన్సీని పెంచుతున్నాయి. అలాగే పొరుగు రాష్ట్రాలలో ఉద్యోగాల భర్తీ పెద్ద ఎత్తున జగుతూంటే ఏపీలో జాబ్ క్యాలెండర్ పేరిట పెద్దగా నియామకాలు లేకపోవడం తో ఆ వర్గం రగులుతోంది.
ఇక మూడేళ్ల పాలనకు చేరువ కావడంతో సొంత పార్టీలోనూ నిరసన మెల్లగా బయల్దేరుతోంది. ఇక మిగిలిన రెండేళ్ల కాలం లో ఏం చేయగలుగుతామన్న ఆందోళనతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీటి కంటే మరో ముఖ్య అంశం కూడా ఉంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇపుడు ఒక కొలిక్కి రావడం, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ దూకుడు, వెల్లడవుతున్న వివరాలలో అధికార పార్టీ కీలక నేతల మీద ఆరోపణలు ఇవన్నీ కూడా వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తుననయనే చెప్పాలి.
మొత్తానికి చూస్తే జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ అంతలా లౌడ్ వాయిస్ రైజ్ చేసి మాట్లాడారు అంటే ఆరు నెలల కాలంలో అధికార పార్టీ మీద వ్యతిరేకత బాగా పెరిగింది అన్న సంకేతాలు ఉండబట్టే అంటున్నారు.
ఇలా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను గేర్ మార్చి సొమ్ము చేసుకోవాలని విపక్షాలు చూస్తున్నాయి. ఈ క్రమంలో మే నెలలో టీడీపీ మహానాడు ఉంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వైసీపీ మీద ఎలాంటి ఆరోపణలు చేస్తుందో ఈ రకమైన యాక్షన్ ప్లాన్ తో దిగుతుందో చూడాలి. మొత్తానికి చూస్తే వైసీపీ సాధించిన అనేక విజయాలు అన్నీ పూర్వ పక్షం కాగా ఇపుడు నలుమూలల నుంచి రాజుకుంటున్న వ్యతిరేకత నానాటికీ పెరిగి పెద్దది అవుతోంది. దీన్ని కనుక ఎంతో కొంత తగ్గించుకునే చర్యలను వైసీపీ పెద్దలు ఇప్పటి నుంచే చేపట్టకపోతే ఏపీలో రాజకీయ వాతావరణం అటు నుంచి ఇటుగా మారడం ఖాయమే అని చెప్పవచ్చు అంటున్నారు.