Begin typing your search above and press return to search.

ఆ 80 కోట్లు వైసీపీలో ఎవ‌రికి వెళ్లాయి?

By:  Tupaki Desk   |   16 March 2022 6:02 AM GMT
ఆ 80 కోట్లు వైసీపీలో ఎవ‌రికి వెళ్లాయి?
X
ఔను.. ఆ 80 కోట్లు ఎవ‌రి ఖాతాలోకి వెళ్లాయి.. ఇదీ.. ఇప్పుడు తాడేప‌ల్లి వ‌ర్గాల్లో హాట్ హాట్‌గా జరుగుతున్న చ‌ర్చ‌. ఎందుకంటే.. ఏపీలో కొన్నాళ్లుగా అనేక విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ముందుగా.. స‌మ‌స్య‌ను సృష్టించ‌డం.. త‌ర్వాత‌.. ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే నెపంతో డీల్ కుదుర్చుకుని.. ప‌రోక్షంగా బాధిత వ‌ర్గం.. స‌మ‌ర్పించుకునే ఏర్పాట్లు చేయ‌డం ష‌రా మామూలుగా మారిపోయిందని మేధావులు సైతం చ‌ర్చించుకుంటున్నారు. ఒక‌ప్పుడు రాజ‌కీయాల్లో పార్టీల‌కు.. పారిశ్రామిక వేత్త‌లు.. అంతో ఇంతో వారి చిత్తాను సారం స‌మ‌ర్పించుకునేవారని అంటున్నారు.

కానీ, ఇప్పుడు ట్రండ్ మారిపోయిందని మేధావులే చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. త‌న చేతికి చ‌మురు అంటుకోకుండా.. పారిశ్రామిక వేత్త‌లు ఠారెత్తి పోయేలా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వ పెద్ద‌లు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. కోట్లు రాబ‌డుతు న్నార‌ని పార్టీలోనే ఒక వ‌ర్గం నేత‌లు చ‌ర్చ చేస్తున్నారు.

ఈ విష‌యంలో అటు పారిశ్రామిక వేత్త‌లు క‌క్క‌లేక‌, మింగ‌లేక‌.. స‌త‌మ‌తం అవుతున్నారని గుస‌గుస వినిపిస్తోంది. దీంతో అడిగినంత ఇచ్చుకుని.. ప‌నులు చ‌క్క‌బెట్టుకునే ప‌రిస్థితిని ఎంచుకుంటున్నారని వీరు చెబుతున్నారు. తాజాగా ఇటీవ‌ల ఏపీలో ఉన్న ఒక మెట‌ల్ కు సంబంధించి కంపెనీలు.. అన్నింటికీ.. విద్యుత్ స‌బ్సిడీ కింద 5 పైస‌లు ఇచ్చారట‌. ఇది పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు కూడా వ‌చ్చిందని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు.

అయితే.. ఈ స‌బ్సిడీ వ్య‌వ‌హారంలో.. డీల్ కుదిరింద‌నేది ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన విష‌యం. ఈ వ్య‌వ హారంలో 20 శాతం వైసీపీలోని కొంద‌రి ఇవ్వాల‌నే ష‌ర‌తు పెట్టిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చ‌ర్చ గా మారింది. అంటే.. దీని విలువ‌.. సుమారు 80 కోట్ల రూపాయ ల‌ని అంటున్నారు.

ఈ మొత్తం వైసీపీ వాళ్ల‌కే వెళ్లాయ‌ని పెద్ద ఎత్తున తాడేప‌ల్లి స‌ర్కిళ్ల‌లో చ‌ర్చ సాగుతోంద‌ట‌. ఇక‌, వాస్త‌వ విష‌యానికి వ‌స్తే.. చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలోనే ఈ స‌బ్జిడీకి సంబంధించిన జీవో ఇచ్చార‌ని.. కొంద‌రు చెబుతున్నారు. అయితే.. దీనిని అమ‌లు చేసే స‌రికే ఆయ‌న స‌ర్కారు కూలిపోయిందని అంటున్నారు.

త‌ర్వాత వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం.. స‌ద‌రు కంపెనీల‌తో ఎన్నోసార్లు భేటీలు జ‌రిపినా.. ఫ‌లితం ద‌క్క‌లేదట‌. చివ‌ర‌కు.. ఒక డీల్ కుదుర్చుకుని 20 శాతం క‌మీష‌న్ ఇస్తేనే ఆ జీవోను అమ‌లు చేస్తామ‌ని.. క‌రాఖండీగా తేల్చేశార‌ని వైసీపీలోని ఓ వ‌ర్గం నాయ‌కులు చెప్పుకొంటున్నారు. దీనికి కంపెనీ వారు ఒప్పుకున్నాక‌.. జీవోను అమ‌లు చేశార‌ని ఈ నేత‌లు తెర‌చాటుగా చేసుకుంటున్న చ‌ర్చ‌ల్లో వెల్ల‌డ‌వుతున్న సారాంశం. అయితే.. దీనికి ఒక వైసీపీ పెద్ద మ‌నిషి అన్నీతానై చ‌క్రం తిప్పార‌ని గుస‌గుస వినిపిస్తోంది.

అంతేకాదు.. ఈ డీల్ రెండేళ్ల బ‌ట్టి ప్ర‌య‌త్నిస్తున్నా కావ‌డంలేద‌ని.. దీంతో టీడీపీకి చెందిన ఒక పెద్ద‌మనిషి ద్వారా క‌థ న‌డిపించార‌ని వైసీపీ నాయ‌కులు అంటున్నారు. మొత్తానికి డీల్ కుదిరిందట‌. అయితే.. ఆ 80 కోట్లు ఎవ‌రి ఖాతాలోకి వెళ్లాయ‌నేది చ‌ర్చగా మారింది.

ఒక‌వైపు పార‌ద‌ర్శ‌క పాల‌న‌.. అంటూనే.. మ‌రోవైపు ఇలా డీల్ పాల‌న చేస్తుండ‌డంపై సొంత పార్టీలోనే తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్ప‌టికైనా వైసీపీ అధిష్టానం ప‌రిగ‌ణిస్తుందా? లేదా..? అనేది చూడాలని ఈ నేత‌లే గుస‌గుసలాడుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.