Begin typing your search above and press return to search.
లోకేష్ శపథం.. కొన్ని ప్రశ్నలు..?
By: Tupaki Desk | 1 March 2022 2:30 AM GMTరాజకీయాల్లో నేతలకు, పార్టీలకు శపథాలు కొత్తకాదు. తమకు ఇబ్బందులు వచ్చిన ప్రతిసారీ.. నాయకు లు ఏదో ఒక విషయంపై శపథాలు చేస్తుంటారు. అయితే..వాటిని ఏమేరకు నెరవేర్చుకుంటారనేది ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విషయంలోనూ.. ఇదే తరహా చర్చ సాగుతోంది.
గత ఏడాది నవంబరులో అసెంబ్లీ వేదిగా.. చంద్రబాబు సతీమణిని దూషించారంటూ.. ఆయ న కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం.. ఆయన బయటకు వచ్చారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో విజ యం దక్కించుకుని.. అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పారు.
అయితే.. ఇదే విషయంపై అప్పట్లో మౌనంగా ఉన్న నారా లోకేష్.. ఇప్పుడు గడిచిన రెండు రోజులుగా తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన విశాఖలో పర్యటిస్తున్నారు. అక్కడి కోర్టులో జగన్.. వైసీపీ పత్రిక సాక్షిపై పరువునష్టం కేసు వేశారు.
తన చిరుతిళ్ల గురించి సాక్షి రాసిన కథనంపై ఆయన 75 కోట్ల కు పరువు నష్టం కేసు వేశారు. అయితే.. దీని విచారణ రెండు రోజులుగా సాగుతుండడంతో లోకేష్.. అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని శపథాలుచేస్తున్నారు.
తన తల్లిని అన్నవారిని చంద్రబాబు, ఎన్టీఆర్ వంటి మహనీయులు క్షమించ వచ్చేమోకానీ.. తాను మాత్రం క్షమించేది లేదని.. స్పష్టంచేశారు.ఎవరైనా ఒక చెంపపై కొడితే.. తానురెండు చెంపలు వాయించేస్తానని.. అన్నారు. వచ్చే 2024 తర్వాత.. తన తల్లిని దూషించిన వారు క్షమాపణలు చెప్పేలా చేస్తానని.. ఇది తన శపథమని అన్నారు. ఎవరినీ ఈ విషయంలో వదలిపెట్టేది లేదన్నారు. అయితే.. అసలు ఈ ఘటన జరిగి.. ఇన్నాళ్లయిన తర్వాత.. ఇప్పుడు స్పందించడం ఏంటనేది ప్రశ్న.
అంతేకాదు.. ఇలా శపథాలు చేయడం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. పైగా.. అధికారంలో లేక పోతే.. ఏమీ చేయలేరా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అధికారం ఉంటేనే తప్ప.. లోకేష్ ఏమీ చేయలేక పోతే.. ఇప్పుడు ఎవరైనా.. ఏమైనా అనొచ్చా? ఒక్క అధికారమే.. టీడీపీ కుటుంబానికి రక్షణ ఇస్తుందా? అనేది ప్రశ్న. మొత్తానికి లోకేష్ మళ్లీ దొరికేశాడని.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.