Begin typing your search above and press return to search.
విషాదం: యుద్ధం లో అమరుడైన నటుడు
By: Tupaki Desk | 10 March 2022 4:53 AM GMTఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం లో ప్రముఖ నటుడు అమరుడయ్యారు. రష్యా సేనలను ఎదుర్కొనేందుకు కదన రంగంలోకి దిగిన నటుడు రష్యా సైన్యం విసిరిన ఓ బాంబుకు బలి అయ్యారు. అనేక చిత్రాల్లో నటించిన ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు పాషా లీ.. రష్యా బాంబు దాడికి ఒక్క సరిగా నేలకొరిగాడు. దీంతో ఒక పక్క యుద్ధం తో సతమతం అవుతున్న ఉక్రెయిన్ వాసులకు ఇది ఒక చేదు వార్తగా నిలిచింది. తన నటనతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్న పాషా లీ.. ఈ బాంబు దాడులతో ప్రాణాలు కోల్పోవడం పట్ల అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
చనిపోయేందుకు ముందు ఆయన తన దేశానికి చేసిన సేవ గురించి సోషల్ మీడియా ద్వారా చెప్పుకుని వచ్చారు. పాషా పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పుతిన్ సైన్యం ఉక్రెయిన్లపై ఎలా బాంబు దాడులకు పాల్పడుతున్న తీరుని సుమారు రెండు గంటల పాటు చిత్రీకరించాడు. ఇందులో భాగంగా అక్కడ నెలకొన్న కొన్ని పరిస్థితులను వివరించారు. అంతేగాకుండా ఇలాంటి వాటికి ఎదురొడ్డి దేశం కోసం నిలబడగలమని అన్నారు. ఎలాంటి విపత్తు వచ్చినా సరే ఈ పోరాటంలో మా చిరునవ్వును చెక్కు చెదర నీయబోమని స్పష్టం చేశారు.
ఎన్నో సినిమాల్లో నటించిన పాషా లీ.. ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య ప్రారంభించిన తరువాత ఉక్రెయిన్ ప్రారంభించిన ఉక్రెయిన్ టెరిటోరియల్ డిఫెన్స్ ఫోర్స్ లో స్వచ్ఛందంగా చేరారు. ఆ దేశంలో ఇర్పిన్ నగరంలో పాషా లీ ఉండే వారు. ఆయన జన్మ స్థలం క్రిమియా అయినా ఉక్రెయిన్ లోనే ఉండే వారు. కేవలం నటుడుగా మాత్రమే కాక... టీవీ ప్రెజెంటర్ గా కూడా తన పని చేశారు.
అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే అలవోక చేయడం ఆయన ప్రత్యేకత అని సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆయన చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో దేశం కోసం ఆయన ఎంత కష్ట పడ్డారు అనేది తెలుస్తుంది.
మరో వైపు 15వ రోజు కూడా రష్యా , ఉక్రెయిన్ పోరు కొనసాగుతోంది. రష్యా అనేక నగరాల్లో ప్రజలే లక్ష్యంగా బాంబు దాడులు, క్షిపణి దాడులు నిర్వహిస్తుంది . దీనిలో అనేక మంది ప్రజలు సమిధలు అవుతున్నారు. అంతే కాకుండా.. రష్యా చేస్తున్న ఈ దాడులను తిప్పి కొట్టడంలో కూడా ఉక్రెయిన్ సేనలు సక్సెస్ అవుతున్నాయి.
మరో వైపు అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆయుధ మానవతా సాయం కోసం ఇతర దేశాలను సహాయం కోరుతున్నారు. అలానే తమ దేశ సేనల్లో ధైర్యం నింపుతున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో చర్చిస్తున్నారు.