Begin typing your search above and press return to search.
కోవిడ్ తర్వాత గుండె పోటు ముప్పు.. ఇవి పాటిస్తే సేఫ్
By: Tupaki Desk | 21 Feb 2022 10:30 AM GMTకరోనా మహమ్మారి సోకితే... వైరస్ నుంచి కోలుకోవడం ఒక్కటే సమస్య కాదు. కోవిడ్ తర్వాత కూడా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ మహమ్మారి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. చాలాకాలం పాటు అస్వస్థతకు గురవుతున్నారు. అంతేకాకుండా శరీరంలోని ప్రధాన అవయవాలు గుండె, ఊపిరితిత్తులు వంటి వాటిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలా మంది చనిపోతున్నారు. వారిలో గుండెపోటు వచ్చిన వారు ఎక్కువ. వైరస్ సోకిన తర్వాత... గుండె పని తీరుపై చాలా దుష్ర్పభావాల బారిన పడుతున్నారని నిపుణులు అంటున్నారు.
కరోనా వైరస్ తొలుత శ్వాస వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో గుండెకు ఆక్సిజన్ అందడంలో అంతరాయం కలుగుతోంది. గుండె కండరాలు వేగంగా పని చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఒత్తిడి వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.
కరోనా సోకిన వారిలో ఎనభై శాతం మంది ఇంటివద్దే కోలుకుంటున్నారు. మిగిలిన వారికి మాత్రమే ఆస్పత్రిలో చికిత్స అవసరం. ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న వారిలో ఇరవై శాతం మందిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. వారిలో ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం ఉందని వెల్లడించారు.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతి నొప్పి, ఒక్కసారిగా గుండె వేగం పెరగడం వంటి లక్షణాలు హార్ట్ ఎటాక్ కు సూచనలు అని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్య ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా రక్తం పలుచన కావడానికి వైద్యులు ఇచ్చే మాత్రలను తప్పకుండా వాడాలని అంటున్నారు. వీటిని ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదని హెచ్చరిస్తున్నారు. అయితే కొందరిలో గుండె వేగం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. కాబట్టి గుండె పనిచేసే విధానాన్ని కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని అంటున్నారు. ఏమైనా తేడాగా ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం అని సూచిస్తున్నారు.
కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నవారికి చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లు ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని అందరికీ కాకుండా... తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారికి ఇవ్వకపోవడమే మంచిదని అంటున్నారు. వీటివల్ల అనేక దుష్ప్రభావాలు ఉంటున్నాయని చెబుతున్నారు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు. బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని.. పండ్లు, కూరగాయలను అందులో భాగం చేసుకోవాలని సూచించారు.
వీలైనంత ఎక్కువగా నీటిని తాగాలి అంటున్నారు. కరోనా తర్వాత కూడా ఏమైనా తేడాగా ఉంటే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లగానే మరీ ఎక్కువగా వ్యాయామం చేయకూడదని... యోగా చేస్తే మంచిదేనని స్పష్టం చేశారు. వీటితో పాటు ఆరు నిమిషాల టెస్ట్ కూడా చేసుకోవాలి. నడవడానికి ముందు ఆక్సిజన్ స్థాయిని రికార్డు చేసుకొని... ఆరు నిమిషాల పాటు మోస్తరు వేగంతో నడవాలి. రెండుసార్లు ఆక్సిజన్ స్థాయిలు సమానంగా ఉంటే గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నట్లేనట!
కరోనా సోకిన వారం రోజులకు సిటీ స్కాన్ చేయించుకుంటే తీవ్రత తెలుస్తుందని అంటున్నారు. సిటీ స్కాన్ లో ఊపిరితిత్తుల ఆరోగ్యం గురించి తెలుస్తుందని... అందులో 10/25 ఉంటే కరోనా ప్రభావం మోస్తరుగా... 15/25 ఉంటే ఎక్కువ ఉన్నట్లని చెబుతున్నారు. సమస్య తీవ్రంగా ఉంటే పల్మనరీ టెస్ట్ చేయించుకోవాలని అంటున్నారు. ఈ విధంగా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వీటితో పాటు యోగా, ప్రాణాయామం, వేడి నీటిని తీసుకోవడం, ఆవిరి పట్టడం, కారం, మసాలాలు తగ్గించడం, పౌష్టికాహారాన్ని తీసుకోవాలి అంటున్నారు.