Begin typing your search above and press return to search.

మలుపు తిరిగిన హిజాబ్ వివాదం

By:  Tupaki Desk   |   16 Feb 2022 5:06 AM GMT
మలుపు తిరిగిన హిజాబ్ వివాదం
X
దేశాన్ని కుదిపేస్తున్న హిజాబ్ వివాదం మంగళవారం కర్ణాటకలో కొత్త మలుపు తిరిగింది. మలుపు అనేకన్నా వివాదానికి ఆజ్యం పోసిందనే చెప్పాలి. ఉడిపి జిల్లాలోని ప్రభుత్వ కాలేజీలో మొదలైన హిజాబ్ వివాదం దేశంలోని చాలా రాష్ట్రాలకు చాల స్పీడుగా పాకిపోతోంది. కర్నాటకతో పాటు చాలా రాష్ట్రాల్లోని హైకోర్టులు ఈ వివాదంపై విచారణ జరుపుతున్నాయి. ఇలాంటి నేపధ్యంలోనే హిజాబ్ వివాదానికి ఆజ్యం పోసిన ఘటనలు జరిగాయి.

అదేమిటంటే హిజాబ్ ధరించిన విద్యార్ధులకు టీచర్లు కూడా మద్దతుగా నిలబడ్డారు. హిజాబ్ ధరించడం అన్నది ముస్లిం మతాచారాల్లో ఒక భాగం కాబట్టి విద్యార్థినులను ఎవరు నిరోధించలేరంటు టీచర్లు కూడా మద్దతు మాట్లాడటం మొదలుపెట్టారు. విద్యా సంస్ధల్లో యూనిఫారం ఉన్నపుడు దాన్నే పాటించాలని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. విద్యార్ధినులు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఏది పడితే అది ధరించి విద్యాసంస్థలకు రావటం తప్పని ప్రభుత్వం చెబుతోంది.

అయితే ప్రభుత్వ నిబంధనలను తాము పాటించేది లేదంటూ ముస్లిం విద్యార్ధినులు చెప్పేశారు. దీంతోనే కాలేజీల్లో, స్కూళ్లల్లో ఒక్కసారిగా వివాదాలు పెరిగిపోయాయి. ఎప్పుడైతే హిజాబ్ వివాదాస్పదమైందో అప్పటి నుండే హిజాబ్ ధరించటం ఎక్కువైపోయింది. అంతకుముందు హిజాబ్ ధరించని విద్యార్ధినులు కూడా ఇపుడు హిజాబ్ ధరించే విద్యా సంస్ధలకు వస్తున్నారు. చాలా స్కూళ్ళల్లో ముస్లిం టీచర్లు కూడా విద్యర్ధినులకు మద్దతుగా హిజాబ్ ధరించే డ్యూటీలకు హజరయ్యారు.

విద్యా సంస్థల్లో మొదలైన ఈ వివాదాన్ని చాలామంది రాజకీయ లబ్ధి కోసమే ఉపయోగించుకుంటున్నట్లు ప్రభుత్వం హైకోర్టు విచారణలో స్పష్టంగా చెప్పింది. అయినా వివాదాలు ఆగటంలేదు.

కొడగు, ఉడిపి, శివమొగ్గ లాంటి జిల్లాల్లోని స్కూళ్ళు, కాలేజీల్లో హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినులను లోపలకు అనుమతించటం లేదు.

అలాగే చాలా స్కూళ్ళలో విద్యార్ధినులు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ను బహిష్కరించారు. తమను హిజాబ్ తో అనుమతిస్తేనే కాలేజీలకు, స్కూళ్ళకు వస్తామని లేదంటే వచ్చేది లేదని విద్యార్ధినులు గట్టిగా బయటే కూర్చున్నారు. చివరకు హిజాబ్ వివాదం ఎలా ముగుస్తుందో ఏమో.