Begin typing your search above and press return to search.
గౌతమ్ సవాంగ్‌కు అలాగే జరగాలి
By: Tupaki Desk | 16 Feb 2022 6:09 AM GMTఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడిగా బాధ్యతల్లో కొనసాగిన డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆకస్మాత్తుగా ఆయన్ని బదిలీ ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సవాంగ్‌పై బదిలీ వేటు వేయడం వెనక ఏం జరిగిందోనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
అయితే ఇటీవల పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉద్యోగులు నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడంపై సీరియస్‌గా ఉన్న జగన్.. అందుకు బాధ్యున్ని చేస్తూ సవాంగ్ను బదిలీ చేశారని అంటున్నారు.
గౌతమ్ సవాంగ్‌ను బదిలీ చేయడంపై రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. సీఎం జగన్‌ను వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రత్యర్థి పార్టీలు మాటల యుద్ధానికి దిగాయి. సవాంగ్‌ను ఎందుకు బదిలీ చేశారని జనసేన అధినేత పవన్ ప్రశ్నించారు. మరోవైపు సీపీఐ నేత నారాయణ కూడా ఈ విషయంపై స్పందించారు.
సవాంగ్‌కు తగిన శాస్తి జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆయనకు అలాగే జరగాలని చెప్పారు. ఒక ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు పాలకవర్గం ఏం చెబితే అది చేయాలని భావిస్తే చివరకు ఇలాంటివే జరుగుతాయన్నారు.
గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యానికి జగన్ ఎంత మంచి చేశారో అందరికీ తెలుసన్నారు. అలాగే పీవీ రమేష్ లాంటి వారిని కూడా అలాగే చేశారని పేర్కొన్నారు. నిజాయతీగా పనిచేసే వారి పట్ల ప్రభుత్వం గతంలో ఇలాగే వ్యవహరించిందని నారాయణ గుర్తు చేశారు. అందుకు ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేష్ నిదర్శనమని ఆయన అన్నారు.
తప్పుల మీద తప్పులు చేసి, విధేయత చూపించిన వారిని ప్రభుత్వం బదిలీ చేయడం అధికారులకు కనువిప్పు కావాలన్నారు. ఒకసారి తప్పులు చేయడం మొదలెట్టాక.. ఒక మంచి పని చేసినా ఇలాగే జరుగుతుందన్నారు. సక్రమంగా ఉద్యోగుల తమ బాధ్యతలు నిర్వర్తించాలని ఒకవేళ అలా చేయలేమనకుంటే పక్కకు జరగాలని నారాయణ తెలిపారు.