Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ జోరుకు బ్రేకులు ?

By:  Tupaki Desk   |   18 Feb 2022 4:45 AM GMT
ప‌వ‌న్ జోరుకు  బ్రేకులు ?
X
మ‌త్స్య‌కార అభ్యున్న‌తి కోసం ప్ర‌స్తుతం వాడ‌వాడ‌లా తిరుగుతున్నారు జ‌న‌సేన నాయ‌కులు.అదే విధంగా ఈ నెల 20న న‌ర‌సాపురంలో మ‌త్స్య‌కార అభ్యున్న‌తి స‌భ‌ను కూడా పెడుతున్నారు.ఇవ‌న్నీబాగానే ఉన్నా రాజ‌కీయంగా ఎంతగా బిజీగా మారిపోదాం అనుకున్నా,ఎంత‌గా ప్ర‌జాసమ‌స్య‌ల‌ పై పోరాడుదాం అన్నా ప‌వ‌న్ ను ఎక్క‌డికక్క‌డ జ‌గ‌న్ నిలువ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

అందుకే ఆయ‌న పూర్తి గా రాజ‌కీయాల వైపు దృష్టి సారించినా కూడా ఆర్థికంగా ఆయ‌న మూలాల‌పై జ‌గ‌న్ నిర్ణ‌యాల ప్ర‌భావం సుస్ప‌ష్టంగా ఉంటోంది.ముఖ్యంగా సినిమా టిక్కెట్ ధ‌ర‌ల పెంపున‌కు సంబంధించి స‌వ‌రించిన ధ‌ర‌ల‌కు సంబంధించి ఓ నిర్ణ‌యం వెలువ‌రించి, సంబంధిత జీఓ ఇవ్వాల్సిన ప్ర‌భుత్వం ఎందుక‌నో తాత్సారం చేస్తోంది.దీంతో ప‌వ‌న్ నిర్మాత‌ల‌కే కాదు ప‌వ‌న్ కు కూడా ఓ విధంగా ఇబ్బందే! గ‌తంలో క‌న్నాఇప్పుడు వేగంగా సినిమాలు చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న ప‌వ‌న్ ను జ‌గ‌న్ అడుగడుగునా అడ్డుకుంటున్నార‌న్న వాద‌న వ‌స్తోంది.

వాస్త‌వానికి టిక్కెట్ల ధ‌ర పెంపు విష‌య‌మై నిన్న‌టి వేళ క‌మిటీ చ‌ర్చించినా సంబంధించి జీఓ వ‌చ్చేట‌ప్ప‌టికి ఇంకొంత కాలం ప‌ట్టే విధంగానే ఉంది. దీనిప్ర‌భావం భీమ్లా నాయ‌క్ పై ప‌డ‌నుంది.ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల కానుంది. అప్ప‌టికీ జీఓ రాదు.దాంతో పాత ధ‌ర‌ల‌తోనే సినిమాను విడుద‌ల చేయాల్సి ఉంటుంది.

ఫ‌లితంగా వ‌కీల్ సాబ్ మాదిరిగానే భీమ్లా నాయ‌క్ క‌లెక్ష‌న్ల‌పైనే ప్ర‌భుత్వం తీసుకునే తాజా నిర్ణ‌యాల ప్ర‌భావం ఉండ‌నుంది.క‌నుక సినిమావిడుద‌లై వ‌రుస వారం రోజులు లేదా రెండు వారాలు హౌస్ ఫుల్స్ తో నిండిపోయినా కూడా ఆశించిన క‌లెక్ష‌న్లు రావు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం భీమ్లా నాయ‌క్ హ‌వాను నిలువ‌రిస్తుందా లేదా జీఓను విడుద‌ల చేసి ఆదుకుంటుందా అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగానే ఉంది.ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సినిమా విడుద‌ల వాయిదా అన్న‌ది సాధ్యం కాని ప‌ని. ఓవ‌ర్సీస్ రిజ‌ల్ట్ కూడా బాగానే ఉంది.అప్పుడే అక్క‌డ బుకింగ్స్ కూడా

మొద‌ల‌య్యాయి.అనూహ్య రీతిలో అక్క‌డ బుకింగ్స్ జ‌రుగుతున్నాయి.ఈ స‌మ‌యంలో సినిమా విడుద‌ల వాయిదా అన్న‌ది అస్స‌లు త‌గ‌ని ప‌ని. నిర్మాత వంశీ మాత్రం ప‌క్కాగా వ‌స్తాం అనే అంటున్నారు.

కానీ ఇప్పుడున్న టికెట్ రేట్ల ప్ర‌కారం అయితే ఈ మ‌ల్టీ స్టార‌ర్ మూవీ నిర్మాత‌కు వ‌ర్కౌట్ అవ్వ‌దు.అందుకే ఏపీ ప్ర‌భుత్వం స‌వ‌రించిన టికెట్ ధ‌ర‌లకు సంబంధించిన జీఓ ఎంత త్వ‌ర‌గాఇస్తే అంత‌గా మంచి ఫ‌లితాలు నిర్మాత‌లు అందుకోవ‌డం అన్న‌ది సులువు అవుతుంది.