Begin typing your search above and press return to search.

అవ‌కాశం ఎవ‌రికి ? సంక్షోభం ఎవ‌రిది?

By:  Tupaki Desk   |   18 Feb 2022 6:35 AM GMT
అవ‌కాశం ఎవ‌రికి ? సంక్షోభం ఎవ‌రిది?
X
అవ‌కాశాల నుంచి సంక్షోభంలోకి రాష్ట్రం వెళ్లిపోయింద‌ని నితిన్ గ‌డ్క‌రీ అంటున్నారు.

ఈ వ్యాఖ్య‌లు అటు వైసీపీని ఇటు టీడీపీని ఉద్దేశించే అన్న విధంగా ఉన్నాయి. అన్వ‌యం ఎలా ఉన్నా కూడా ఎవ‌రి దారిలో వారు ఆలోచిస్తే అవ‌కాశాలు ఎవ‌రివి సంక్షోభం ఎందుకు వ‌చ్చింది అన్న‌వి ఈజీగానే అర్థం అవుతాయి. ఆ పాటి ఆలోచ‌న చేసినప్పుడు మాత్రమే ఫ‌లితాలు వ‌స్తాయి. ముందుగా టీడీపీ అవ‌కాశాలు చూద్దాం.

ఉమ్మ‌డి ఆంధ్రాలో 9 ఏళ్లు తిరుగులేని విధంగా చంద్ర‌బాబు హ‌యాంలో టీడీపీ అధికారం అందుకుని దూసుకుపోయింది. ఆ రోజు రాజ‌శేఖ‌ర్రెడ్డి పాద‌యాత్ర చేయ‌క‌పోతే 2014లో కాదు 2004లోనే కాంగ్రెస్ ఇంటికిపోయేది.

అంటే ప‌దేళ్ల కింద‌టే కాంగ్రెస్ పార్టీ ఇంటికి ప‌రిమితం అయి ఉండేది. ఆ త‌రువాత ప‌రిణామాల నేప‌థ్యంలో 2004లో వైఎస్సార్ ముఖ్య‌మంత్రిగా బాగానే రాణించారు కానీ త‌రువాత ఎన్నిక‌ల్లో అత్తెస‌రు మార్కుల‌తో ఒడ్డెక్కాన‌ని తానే స్వ‌యంగా ఒప్పుకున్నారు. ఆ విధంగా 2009లోనూ ఆయ‌న సీఎం అయ్యారు. ఆ త‌రువాత అనూహ్య రీతిలో ఆయ‌న ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు.

ఇక అటుపై వ‌చ్చిన రాజ‌కీయ అస్థిర‌త, తెలంగాణ ఉద్య‌మం వీట‌న్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే రోశ‌య్య కానీ కిర‌ణ్ కుమార్ రెడ్డి కానీ వ‌చ్చిన అవ‌కాశాల‌ను బాగానే వాడుకున్నారు. త‌మ ప‌రిధిలో తాము ప‌నిచేశారు. ఇదే స‌మ‌యంలో బ‌ల‌మ‌యిన స‌మైక్య వాదం వినిపించే వైఎస్సార్ లేక‌పోవ‌డంతో అదే అదునుగా కేసీఆర్ బాగానే రాణించి ఇప్పుడీయ‌న జాతీయ స్థాయిలో త‌న అవ‌కాశాల కోసం వెతుకులాట ఆరంభించారు.

ఇక జ‌గ‌న్ కూడా అవ‌కాశాలు బాగానే అందుకున్నారు. చంద్ర‌బాబును ఓడించి బాగానే పేరు తెచ్చుకున్నారు. అయితే చంద్ర‌బాబు చెప్పిన విధంగా సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఒడ్డెక్కించిన ఘ‌ట‌న‌లు అయితే మాత్రం జ‌గ‌న్ లో లేవు. ఇక‌పై వ‌స్తాయో రావో అన్న‌ది మాత్రం తేల్చ‌లేం అని అంటున్నారు టీడీపీ వ‌ర్గీయులు.