Begin typing your search above and press return to search.

మ‌ద్య నిషేధం హామీ ఇవ్వ‌లేదా? ఇవ్వ‌లేద‌ని జ‌గ‌న్ అంటే.. రాజీనామా చేస్తా: అచ్చెన్న స‌వాల్‌

By:  Tupaki Desk   |   24 March 2022 9:30 AM GMT
మ‌ద్య నిషేధం హామీ ఇవ్వ‌లేదా?  ఇవ్వ‌లేద‌ని జ‌గ‌న్ అంటే.. రాజీనామా చేస్తా:  అచ్చెన్న స‌వాల్‌
X
ఏపీలో క‌ల్తీసారా, మ‌ద్య నిషేధం, జేబ్రాండ్ లిక్క‌ర్ అంశాల‌పై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ తీవ్ర‌స్థాయిలో ఉద్య‌మిస్తున్న విష‌యం తెలిసిందే. ఇంటా బ‌య‌టా అన్న‌ట్టుగా అటు అసెంబ్లీ, మండిలిలోనూ.. ఇటు ప్ర‌జ‌ల్లోనూ.. ఇదే అంశంపై అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరిచేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో మ‌ద్య నిషేధం అమ‌లు చేస్తామ‌ని. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చిన జ‌గ‌న్ ఇప్పుడు మ‌ద్యాన్ని పారిస్తున్నారంటే.. టీడీపీ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతోంది.ఈ క్ర‌మంలో తాజాగా టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్న సీఎం జ‌గ‌న్ కేంద్రంగా విరుచుకుప‌డ్డారు.

వైసీపీ అధికారంలోకి వస్తే మద్యపానంపై నిషేధం విధిస్తామని జగన్ చెప్పలేదా అని అచ్చెన్న‌ ప్రశ్నిం చారు. అధికారంలోకి వచ్చాక ఎందుకు చేయలేదని నిలదీశారు. మద్య నిషేధం చేస్తానని జగన్ చెప్పలేదు అంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

"నాకు ఓట్లు వేయండి. నేను ముఖ్యమంత్రి అయిన తెల్లవారే మద్యపానం నిషేధం దశలవారిగా చేస్తానని చెప్పిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి వైసీపీ పార్టీనా? నేనా? అడిగిన సమాధానం చెప్పాలి. నిషేధం విధిస్తానని చెప్పావా? లేదా? అలా చెప్పలేదని జగన్ చెబితే నేను రాజకీయాలు మానేస్తాం." అని అచ్చెన్న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

"రాష్ట్రంలో మద్యం పాలసీని ఎందుకు మార్చారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 27 మంది చనిపోయారని వారి కుటుంబసభ్యులే చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరామని వారు తెలిపారు." అని అచ్చెన్న చెప్పారు. నాటుసారా అంశంపై అసెంబ్లీలో చర్చించాలని అడిగామన్నారు. నాటుసారా మరణాలను సహజ మరణాలుగా సభలో సీఎం చెప్పారు. ఇవన్నీ అడిగినందుకే టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేశారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు నోటితో భజన చేస్తున్నారు. అసెంబ్లీలో తమకు మైక్‌ ఇవ్వనందునే బయటకు వచ్చాము అని అచ్చెన్నాయుడు తెలిపారు.

మ‌ద్యం పాల‌సీ మార్చారు
గతంలో నచ్చిన బ్రాండ్‌ కొనుక్కునే స్వేచ్ఛ ఉండేదని, కానీ నేడు రేటు చెప్పి మద్యం అడగాల్సిన దుస్థితికి తెచ్చారని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత బ్రాండ్లు చంద్రబాబు తెచ్చినవే అని చెప్పడం దారుణం అన్నారు. టీడీపీ హయాంలో మద్యం బ్రాండ్ల గురించి ఎవరైనా ప్రశ్నించారా అని ఆయన నిలదీశారు. మద్యం పాలసీ మార్చి.. దుకాణాలు తీసుకోవడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు.

ప్రతి మద్యం దుకాణంలో 10 సీసాలు తీసుకుని తనిఖీలు చేయిద్దామని, మద్యంలో ఎంత హానికర రసా యనాలు ఉన్నాయో తెలుస్తుందని ఆయన సవాల్ విసిరారు. మద్యం కొనుక్కోలేకే నాటుసారా తాగారని, ఈ విషయం అందరికీ తెలుసని అచ్చెన్న అన్నారు. మరణాలపై జ్యుడీషియల్‌ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.