Begin typing your search above and press return to search.
అమరావతి విషయంలో జగన్ అదే చేయాలి... ?
By: Tupaki Desk | 3 March 2022 6:30 AM GMTఏపీకి రాజధాని అమరావతి. ఇది ఎనిమిదేళ్ళుగా జనాలలో ముద్ర పడిపోయిన విషయం. గత అయిదేళ్ళ టీడీపీ ఏలుబడిలో అమరావతి గురించే పెద్ద ఎత్తున చర్చ సాగేది. జగన్ సీఎం అయ్యాక మాత్రం అమరావతిని అలా పక్కన పెట్టేశారు. దాని ప్లేస్ లో మూడు రాజధానుల విషయాన్ని ముందుకు తెచ్చారు. విశాఖ మన పాలనా రాజధాని అన్నారు. దానికి చట్టం కూడా చేశారు. అయితే అది అనేక న్యాయ వివాదాల మధ్య నలిగి చివరికి గత ఏడాది ప్రభుత్వమే చట్టాన్ని రద్దు చేసుకుంది.
ఈ నేపధ్యంలో కేంద్రం మనసు మారిందేమో, అమరావతి రాజధాని కోసం మౌలిక సదుపాయాలతో పాటు అనేక కీలకమైన నిర్మాణాలను అక్కడ చేపట్టడానికి ఏకంగా బడ్జెట్ లో రెండున్నర వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ఏపీకి కేంద్రం ఏమీ చేయడంలేదు అని విమర్శలు చేసేవారికి జవాబుగా కేంద్రం తన వంతుగా మంచి ప్రయత్నమే చేసింది అనుకోవాలి. ఒక విధంగా కేంద్రం ఏపీ మీద చల్లని చూపు చూసింది.
ఈ క్రమంలో ఈ నిధులను సవ్యంగా వాడుకుని అమరావతిలో సచివాలయం ఇతర అభివృద్ధి భవనాలను ఏర్పాటు చేసుకునేందుకు వైసీపీ సర్కార్ తగిన స్థాయిలో ప్రయత్నాలు చేయాలని అంతా సూచిస్తున్నారు. కేంద్రం రాజధానికి ఇప్పటిదాకా ఏమీ ఇవ్వలేదు. దాని మీద అంతా కామెంట్స్ చేస్తూ వచ్చారు. వైసీపీ పెద్దలు కూడా అదే చెప్పారు. కేంద్రం నిధులు ఇవ్వడంలేదు, ఏపీకి చేయడానికి డబ్బులు లేవని కూడా అంటూ వచ్చారు.
ఇపుడు అలాంటి వాటికి ఆస్కారం లేకుండా కేంద్రం నిధులు ఇస్తున్న వేళ దానిని సద్వినియోగం చేసుకోవాలని అంతా కోరుకున్నారు. ఏపీకి అమరావతినే రాజధానిగా ఉంచాలన్న్న డిమాండ్ కూడా వస్తోంది. దాని కోసం కేంద్రం ఇచ్చే నిధులను వాడుకోవాలని, అవసరమైన డీపీఆర్ ని సిద్ధం చేసి సత్వరమే కేంద్రానికి పంపించడం ద్వారా వైసీపీ ఏలుబడిలో అమరావతిలో ఎంతో కొంత పని జరిగింది అనిపించుకుంటే బెటర్ అంటున్నారు.
ఇక విశాఖపట్నం ఎలాగూ మెగా సిటీనే. అవసరం అనుకుంటే దాన్ని ఏపీకి గ్రోత్ ఇంజన్ గా ఆర్ధిక నగరంగా అభివృద్ధి చేయవచ్చు. దానికి ప్రత్యేకంగా పాలనా రాజధాని అనో మరో పేరో పెట్టి కొత్త వివాదాలు చేయాల్సిన పని లేదు. రాజధాని అని అనకపోయినా మిగిలిన రాష్ట్రాల్లో చాలా సిటీస్ అసలు రాజధానుల కంటే కూడా ఫుల్ గా డెవలప్ అయిన ఉదంతాలు ఉన్నాయి. అందువల్ల ఇప్పటికైనా వైసీపీ పెద్దలు మూడు రాజధానుల మూడ్ నుంచి బయటకు వచ్చి అమరావతి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తే మంచిది అన్నదే అందరి ఆలోచన. అదే వైసీపీకి కూడా రాజకీయంగా అన్ని విధాలుగా మేలు చేసే పరిణామమని కూడా అంటున్నారు.