Begin typing your search above and press return to search.
కొత్త జిల్లాల హద్దులు చెల్లవా ? దేవుడా !
By: Tupaki Desk | 2 March 2022 12:30 AM GMTకొత్త జిల్లాలకు సంబంధించి వివాదాలన్నవి రేగుతూనే ఉన్నాయి.ఇప్పటికే ఇందుకు సంబంధించి ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అభ్యర్థనలు వినేందుకు కూడా గడువు పూర్తయింది. ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా అనేక అభిప్రాయాలు విన్నది.
వాటిపై పరిష్కారం కూడా ఆలోచించనుంది.ఇక కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కార్యాలయాల ఏర్పాటు అన్నది ఓ పెద్ద సమస్యగా మారనుంది.కొత్త భవనాల నిర్మాణంఇప్పటికిప్పుడు సాధ్యం కాని పని.కనుక చాలా చోట్ల ప్రభుత్వ పరిధిలో ఉన్న పాత భవనాలనే కలెక్టరేట్లుగా మార్చేందుకు చూస్తున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల భవనాలను కూడా కార్యాలయాలుగా చేయనున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా అసలు ఏళ్లకు ఏళ్లు చరిత్ర ఉన్న ప్రభుత్వ భవనాలకు ఉన్న నిర్మాణ నాణ్యత ఎంతని? వాటిలో తాము ఎంతకాలం నిర్భయంగా పనిచేయగలమని అని ప్రశ్నిస్తున్నారు అధికారులు.
మరోవైపు జిల్లాల ఏర్పాటుపై ఇప్పటికీ తీవ్ర అభ్యంతరాలు ఉన్నా వీటిని రాజకీయంగా పరిష్కరించేందుకే ఎక్కువ వైసీపీ ప్రయత్నిస్తోంది.అంటే టీడీపీ అభ్యంతరాలు లేవనెత్తిన చోట పెద్దగా వాటిని పరిగణించకూడదనే వైసీపీ అనుకుంటోంది.
ఆ విధంగా చేస్తే రాజకీయంగా పసుపు పార్టీకి అధిక ప్రాధాన్యం ఇచ్చిన వాళ్లం అవుతామని భావిస్తున్నారు వైసీపీ పెద్దలు.అందుకే బాలకృష్ణ చెప్పిన విధంగా హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఒకవేళ తీసుకున్నా ఆ క్రెడిట్ బాలయ్యకు వెళ్తుంది కానీ తమకు దక్కదని అంటున్నారు కొందరు వైసీపీ నాయకులు.ఇదే సమయంలో కొత్త జిల్లా ల హద్దులు కూడా చెల్లవని,జన గణన పూర్తి కానిదే అస్సలు కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా నిర్ణయించే హద్దులు ఏవీ చెల్లవని బాలయ్య అల్లుడు లోకేశ్ అంటున్నారు. కేంద్రం చెప్పిన ప్రకారం జనగణన పూర్తయితే కానీ ఏ జిల్లా హద్దులు మార్చేందుకు వీల్లేదని,ఒకవేళ అలా జరిగితే తాము న్యాయపోరాటం చేస్తామని అంటున్నారీయన!