Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీలో ర‌చ్చ త‌గునా? టీడీపీ వైపే అందరి వేళ్లు!

By:  Tupaki Desk   |   23 March 2022 5:30 PM GMT
ఏపీ అసెంబ్లీలో ర‌చ్చ త‌గునా?  టీడీపీ వైపే అందరి వేళ్లు!
X
40 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీపై విప్పుడు పెద‌వి విరుపు క‌నిపిస్తోంది. సామాన్యుల నుంచి మేధావు ల వ‌ర‌కు.. గ‌డిచిన వారం రోజులుగా జ‌రుగుతున్న ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌ను గ‌మ‌నిస్తున్న‌వారు.. టీడీపీ వైపే అంద‌రూ.. వేళ్లు చూపిస్తున్నారు. స‌భ ప్రారంభం కాగానే... టీడీపీ స‌భ్యుల ఆందోళ‌న మొద‌లై పోతోంది. గ‌తంలో ఇలాంటి ప‌రిస్థితి ఉండేదికాదు. స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. ఏదైనా అంశంపై.. ముందు.. తీర్మానం ఇచ్చి.. త‌ర్వాత‌.. చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్టేవారు. స‌భ్యులు త‌మ త‌మ స్థానాల్లో లేచి నిల‌బ‌డి.. ఆందోళ‌న వ్య‌క్తం చేసేవారు.

అయితే... ఇప్పుడు టీడీపీ అనుస‌రిస్తున్న విధానంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్యక్త‌మ‌వుతోంది. ఒక‌ప్పుడు.. అం టే.. మూడేళ్ల కింద‌ట ఇదే స‌భ‌లో.. టీడీపీ అనేక నీతులు చెప్పింది. వైసీపీ నేత‌లు.. గ‌లాభా సృష్టిస్తున్నార ని.. పేర్కొంది. కానీ.. ఏనాడూ.. వైసీపీ స‌భ్యులు.. స్పీక‌ర్‌పై కాయితాలు చించి పోయ‌లేదు.

అంతేకాదు.. ఏనా డూ.. చ‌క్క భ‌జ‌న చేయ‌లేదు. విజిల్స్ వేయ‌లేదు. కానీ, అరుపులు , కేక‌ల‌తో మాత్రం ద‌ద్ద‌రిల్లేలా చేశారు. ఇప్పుడు ఇదీ జ‌రుగుతోంది. కానీ, దీనికి మించి.. అన్న‌ట్టుగా కూడా టీడీపీ స‌భ్యులు వ్య‌వ‌హరిస్తున్నారు.

వాస్త‌వానికి టీడీపీ స‌భ్యుల‌ను స‌మ‌ర్ధించే వారు కూడా ఈ ప‌రిస్థితిని చూసి.. మిన్న‌కుంటున్నారు. అంటే.. దీనిని బ‌ట్టి టీడీపీ స‌భ్యుల ఆందోళ‌న ఏరేంజ్‌లో ఉందో అర్ధం అవుతుంది. అయితే.. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభవం ఉన్న పార్టీ.. నేత‌లు.. ఇలా చేయొచ్చా? అస‌లు స‌భ‌లో నిర‌స‌న తెలిపేందుకు ఇంత‌క‌న్నా.. హుందా అయిన అంశాలు లేవా? అనేది చ‌ర్చ‌. గ‌తంలో అన్న‌గారి హ‌యాంలోనూ అప్ప‌టి కాంగ్రెస్ స‌ర్కారు పై నిర‌స‌న తెల‌పాల్సి వ‌చ్చిన‌ప్పుడు.. హుందాగా వ్య‌వ‌హ‌రించారు.

త‌న స్థానంలో లేచి నిల‌బ‌డి మౌనంగా ఉండేవారు. ఇది.. ఆనాటి అన్నిమీడియాల్లోనూ..(ప‌త్రిక‌లు, రేడియో ) తీవ్ర‌స్థాయిలో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. సింప‌తీ కూడా పెంచింది. కాని, ఇప్పుడు టీడీపీ స‌భ్యులు చేస్తున్న వ్య‌వ‌హారం.. క‌ళ్ల‌కు క‌నిపిస్తోంది.

స్పీక‌ర్ అనేక సార్లు న‌చ్చ‌జెప్ప‌డం.. వారించ‌డం.. కూర్చోమ‌న‌డం.. సాధ్య‌మైనంత‌వ‌ర‌కు అవ‌కాశం ఇవ్వ‌డం.. వంటివి స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో మాదిరిగా.. వెంట‌నే స‌స్పెండ్ చేయ‌డం అనేది ఆయ‌న పెట్టుకోలేదు. సో.. ఈ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే.. టీడీపీ త‌ప్పు చేస్తేందనే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.