Begin typing your search above and press return to search.
ఏపీలో జోరుగా సాగుతున్న 'బ్లాక్' టికెట్ల దందా
By: Tupaki Desk | 26 March 2022 4:31 PM GMTఆంధ్రాలో సినిమా టికెట్ రేట్ల దోపిడీ విచ్చలవిడిగా సాగుతోందన్న విమర్శలున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తొలిరోజు దోచుకున్న వాడికి దోచుకున్నంతగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల వేళ అమ్ముకున్న వాడికి అమ్ముకున్నంత అన్నట్టుగా ఉందట..
బెనిఫిట్ షోలు అని చెప్పి.. ఫ్యాన్స్ షోలు అని చెప్పి ఇష్టం వచ్చిన రేట్లకు టికెట్ లు అమ్మేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఎక్కడిక్కడ ఎవరి లెవల్ లో వారు టికెట్ ల మీద సంపాదించే పనిలో పడ్డారని తెలిసింది. ఆంధ్రలోని ఓ కీలకమైన పట్టణంలో డిస్ట్రిబ్యూటర్ నే టికెట్ లు మొత్తం తన ఆఫీసుకు తెప్పించుకొని బ్లాక్ రేట్లకు అమ్ముతున్నారని ఓ ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇలాంటి వ్యవహారం తొలిసారి చూస్తున్నామని.. ఆ పట్టణం డిస్ట్రిబ్యూటర్లు నెత్తినోరు బాదుకుంటున్నట్టు సమాచారం. థియేటర్లు బ్లాక్ చేయడం వేరు.. డిస్ట్రిబ్యూటర్ నే బ్లాక్ చేయడం ఇక్కడ మరీ దారుణం అంటున్నారు. ఇలాంటిది ఆర్ఆర్ఆర్ సినిమా వేళ మొదటి సారి చూస్తున్నామని అంటున్నారు.
విజయవాడలోని ఓ మాల్ లో చిత్రమైన వ్యవహారానికి తెరతీశారు. టికెట్ కావాలంటే ఫుడ్ ప్యాకేజీ తీసుకోవాల్సిందే. టికెట్ ఖరీదు రూ.800 గా నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో అసలు టికెట్ రేటు 236 కాగా.. ఆ టికెట్ కు ఫుడ్ కూపన్ జతచేసి అమ్మేస్తున్నట్టు మాచారం.
దీని మొత్తం విలువ 550 గా ఉందని సమాచారం. కోక్, పాప్ కార్న్ ఇస్తున్నారని తెలిసింది. ఈ మాల్ కు వైసీపీతో సంబంధాలున్నాయనే టాక్ ఉంది. దాంతో అధికారులు ఏమీ చేయలేకపోయారు.
చాలా చోట్ల వైసీపీ చోటామోటా నాయకులు తమ పలుకుబడి ఉపయోగించి టికెట్ లు తీసుకొని బ్లాక్ లో విక్రయించాలని ఆరోపణలున్నాయి. చేస్తున్నది వైసీపీ నాయకులు కావడంతో అధికారులు మౌనం దాల్చారని తెలిసింది. మొత్తం మీద ఏ సినిమా టికెట్ లు పేదవాడికి అందుబాటులో ఉండాలని సీఎం జగన్ అనుకున్నా అది మాత్రం ఏపీలో జరగడం లేదని తెలుస్తోంది.