Begin typing your search above and press return to search.

జగనొక బ్రహ్మ పదార్ధం...?

By:  Tupaki Desk   |   22 March 2022 7:45 AM GMT
జగనొక బ్రహ్మ పదార్ధం...?
X
అవునా. జగన్ బ్రహ్మ పదార్ధంగా ఉంటారా. ఈ ముక్క తెలియాలీ అంటే ముందు బ్రహ్మపదార్ధం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎవరికీ అర్ధం కాని దాన్నే బ్రహ్మ పదార్ధం అంటారు. మరి జగన్ ఎవరికీ నిజంగా అర్ధం కారా అన్నదే ఇక్కడ మ్యాటర్. ఆ విధంగా ఆలోచిస్తే ఈ మాట అన్నది వైసీపీ నేత. జగన్ అంటే విపరీతమైన ప్రేమాభిమానాలను కురిపించే సినీ రచయిత, నటుడు క్రిష్ణ మురళి.

మరి ఆయ‌న నోట జగన్ గురించి విమర్శలు సెటైర్లు వేసే టైప్ కాదు కదా. ఎందుకలా సడెన్ గా పోసాని వారు ఇలా అనేశారు అంటే విషయం పూర్తిగా తెలుసుకోవాలి మరి. పోసాని తాజాగా తిరుపతి దేవదేవున్ని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. జగన్ సినిమా టికెట్ల విషయంలో సినీ పరిశ్రమకు, ఇటు సామన్య ప్రజలకు కూడా పూర్తి న్యాయం చేశారని చెప్పారు.

సినిమా టికెట్ల ఇష్యూలో జగన్ మీద చాలా చాలా అన్నారని, ఆయన్ని అందరూ అనేక రకాలుగా విమర్శించార‌ని పోసాని గుర్తు చేశారు. అయితే తాను జగన్ గురించి ఒకే ఒక మాట చెబుతాను అంటూ ఆయన ఈ బ్రహ్మ పదార్ధం అన్న పద ప్రయోగం చేశారు.

అంతటితో ఆగిపోలేదు, బ్రహ్మ పదార్ధం లా జగన్ దూరాన ఉండి చూసే వారికి ఏ మాత్రం అర్ధం కాకపోయినా ఆయనను దగ్గరగా చూసేవారికి మాత్రం దైవ ప్రసాదంగానే కనిపిసారు అని భలే ట్విస్ట్ ఇచ్చేశారు. అంటే జగన్ కి సన్నిహితంగా ఉండేవారికే ఆయన అంటే ఏమిటో తెలుస్తుందని దీని భావమని పోసాని వారు చెప్పకనే చెప్పారన్నమాట.

జగన్ మీద అనేక విమర్శలు చేసేవారు అంతా ఆయన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవడం వల్లనే అని కూడా ఈ సినీ మాటల రచయిత భావన అని కూడా అర్ధం చేసుకోవాలి.

ఇక దైవ ప్రసాదం అంటే వరమే కదా. అంటే జగన్ని సరిగ్గా అర్ధం చేసుకోవాలి అన్నదే పోసావి మాటల అర్ధం అని అనుకోవాలి. ఇంతకీ పోసాని చెప్పిన ఈ మాటలు అర్ధమవుతున్నాయా లేకపోతే అవి కూడా బ్రహ్మ పదార్ధంగా అనుకోవాలా. ఏమో ఎవరి అర్ధాలు వారివి. ఆ అర్ధాలకు పరమార్ధాలు కూడా ఎవరికి తోచినవి వారివే.