Begin typing your search above and press return to search.
బలవంతపు వసూళ్లు మా ప్రభుత్వం చేయదన్న బొత్స
By: Tupaki Desk | 21 March 2022 1:33 PM GMTచెత్త పన్ను, ఆస్తిపన్ను ఇలా దేన్ని వదలకుండా జగన్ ప్రభుత్వం పన్ను వేస్తోందన్న ప్రతిపక్షాల విమర్శలపై మంత్రి బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. పన్నుల విషయంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై స్పందించారు. ఇవన్నీ జగన్ ప్రభుత్వంలోనే కాదని.. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలోనూ కొనసాగాయని మంత్రి బొత్స అన్నారు.
ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ ఈ విధానం ఇప్పుడే కొత్తగా వచ్చిందా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన బొత్స సత్యనారాయణ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంట్ తీసేస్తామనడం తప్పు అంటే ఎలా అని ప్రశ్నించారు. ఆస్తుల జప్తు ఇవాళ కొత్తగా వచ్చిన అంశం కాదన్న బొత్స.. పన్నులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని చెప్పటం తప్పు అంటే ఎలా? అని నిలదీశారు.
గత ప్రభుత్వాలు చేసినప్పుడు ఎందుకు ఈ విధానాన్ని ప్రశ్నించలేదని మంత్రి బొత్స మండిపడ్డారు. కానీ జప్తు చేయడం మా ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. పన్నులు కట్టకపోతే స్థానిక సంస్థలు ఎలా బలోపేతం అవుతాయని అన్నారు. పన్ను కట్టకపోతే నోటీసులు ఇవ్వొచ్చని.. కానీ ఇంటికి తాళాలు వేయడం కరెక్ట్ కాదని మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు.
బలవంతపు వసూళ్లు తమ ప్రభుత్వ విధానం కాదని బొత్స స్పష్టం చేశారు. పన్నులు కట్టలేదని ఇంటికి తాళం వేయమని అధికారులకు ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదన్నారు. అయితే కొంతమంది అధికారులు అలా చేశారని తన దృష్టికి వచ్చిందని.. అసలు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకుంటున్నట్లు చెప్పారు. అవసరమైతే అధికారులపై చర్యలు తీసుకుంటామని బొత్స తెలిపారు.
ఏపీలో కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తున్నారు. ఆస్తి పన్ను కట్టకుంటే ఆస్తులు జప్తు చేయడం.. ఇలా పలు రకాల పన్నుల విషయంలో అధికారుల చర్యలపై విమర్శలు వినిపిస్తున్నాయి.
చెత్త పన్ను, ఆస్తి పన్ను పేరిట అధికారుల వేధింపులు పెరిగిపోయాయని.. పన్నుల వసూలు పేరిట జనం పట్ల అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారని.. చెత్త పన్ను కట్టలేదంటూ కర్నూలు జిల్లాలో దుకాణాల ముందు చెత్త వేయడం.. ఆస్తి పన్ను కట్టకుంటే ఆస్తులు జప్తు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే బొత్స దీనిపై వివరణ ఇచ్చారు.